Maharashtra Factory : వాడి పడేసిన మాస్కులతో పరుపులు..ఫ్యాకర్టీ నిర్వాకం..బట్టబయలు చేసిన పోలీసులు

కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి ఉపయోగించే మాస్క్ లతో పరుపులు తయారు చేస్తున్న ఓ ఫ్యాక్టరీ గుట్టురట్టును చేశారు పోలీసులు.

Used Masks

Masks Instead Of Cotton In Mattresses : కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి ఉపయోగించే మాస్క్ లతో పరుపులు తయారు చేస్తున్న ఓ ఫ్యాక్టరీ గుట్టురట్టు చేశారు పోలీసులు. పెద్ద మొత్తంలో వాడి పడేసిన మాస్క్ లు ఉన్నట్లు గుర్తించారు. మాస్కులన్నింటినీ తగులబెట్టి…ఫ్యాక్టరీ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. వీరి ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

జల్గావ్ జిల్లాలో ఓ ఫ్యాకర్టీలో పరుపులు తయారు చేస్తున్నారు. కానీ..పరుపులో దూది లేదా ఇతర మెటీరియల్ ఉంచకుండా..వాడి పడేసిన మాస్కులు పెడుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులకు షాక్ కలిగించే దృశ్యాలు కనిపించాయి. పెద్ద మొత్తంలో మాస్క్ లు ఉండడం, పరుపుల్లో మాస్క్ లు నింపడాన్ని గుర్తించారు. వెంటనే ఆ మాస్క్ లన్నీ తగులబెట్టారు. ఫ్యాక్టరీ యజమాని అమ్జాద్ అహ్మద్ మన్సూరీపై కేసు నమోదు చేశారు.

ఇక దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. లక్షలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. మహారాష్ట్రలో వైరస్ పంజా విసురుతోంది. రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూస్తుండడంతో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటోంది. లాక్ డౌన్ పెట్టాలా ? వద్దా ? అనే దానిపై మహా ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
Read More : Death certificate issues : కూర్చుని అన్నం తింటున్న వ్యక్తి చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ తో పాటు డెడ్ బాడీ ఇచ్చిన డాక్టర్లు