ముక్కులో ఆక్సిజన్ ట్యూబ్..పక్కనే సిలిండర్ పెట్టుకుని ఇంటర్ పరీక్ష రాసిన బాలిక

  • Publish Date - February 26, 2020 / 04:59 AM IST

పరీక్షహాల్లో ఓ బాలిక పరీక్ష రాస్తున్న దృశ్యం చూస్తే అయ్యో..బిడ్డా ఎంత కష్టమొచ్చింది..అయినా సరే పట్టుదలతో పరీక్ష రాస్తున్నావు..నీ పట్టుదలకు హ్యాట్సాఫ్ అనాలని పిస్తుంది. ముక్కులో ఆక్సిజన్ పైప్. పక్కనే ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ఇంటర్ పరీక్ష రాసింది ఓ బాలిక. 

వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన సఫియా జావేద్ అనే బాలిక ఇంటర్ చదువుతోంది. ఇంటర్ బోర్ట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయక్కడ. సఫియా పరీక్షలు రాయాలి. కానీ అనారోగ్యం..ఏడాది అంతా కష్టపడి చదివిన తరువాత పరీక్ష రాయకపోతే సంవత్సరమంతా వేస్ట్ అవుతుంది. అందుకే ఎలాగైనా పరీక్ష రాయాలనుకుంది. కానీ ఆక్సిజన్ పైప్ తీస్తే ఆమె బ్రతకదని డాక్టర్లు చెప్పారు. 

దీంతో అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సఫియా ముక్కులో ఆక్సిజన్ పైపు పెట్టుకుని పక్కనే ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకునే పరీక్షకు హాజరైంది. పరీక్ష రాసింది. ఆక్సిజన సిలిండర్ తోనే పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చిన ఆమె తల్లిదండ్రులు సఫియాతో పరీక్ష రాయించారు. 

పరీక్ష రాసిన తరువాత సఫియా మాట్లాడుతూ..తన తల్లిదండ్రులు ఇచ్చిన ధైర్యంతో ఇంటర్ పరీక్ష రాయగలిగాననీ..నాకు కంప్యూటర్ సైన్స్ అంటే చాలా ఇష్టమని ఇంజనీరింగ్ లో అదే సబ్జెక్ట్ తీసుకంటానని తెలిపింది. అనారోగ్యంతో ఉన్న సఫియా ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకునే పరీక్ష రాయటం చాలా స్ఫూర్తిదాయకమైనదనీ అన్నారు సఫియా తండ్రి.