Bald Groom : పెళ్లిలో సొమ్మసిల్లి పడిపోయిన వరుడు – షాకిచ్చిన వధువు

మహిళలను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయిలకు కాలం చెల్లింది. మహిళలకు నచ్చకపోతే ఆఖరుకు పీటల మీద పెళ్ళిని కూడా రద్దు చేసుకుంటున్నసందర్భాలు ఉంటున్నాయి.

Bald Groom : పెళ్లిలో సొమ్మసిల్లి పడిపోయిన వరుడు – షాకిచ్చిన వధువు

bald groom

Updated On : May 23, 2022 / 5:12 PM IST

Bald Groom :  మహిళలను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయిలకు కాలం చెల్లింది. మహిళలకు నచ్చకపోతే ఆఖరుకు పీటల మీద పెళ్ళిని కూడా రద్దు చేసుకుంటున్నసందర్భాలు ఉంటున్నాయి. తనకున్న బట్టతలను దాచిపెట్టి పెళ్లి చేసుకుంటున్న వరుడిని, పెళ్లి కూతురు ఆఖరు నిమిషంలో తిరస్కరించిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఉన్నావ్ కు చెందిన వధువుకు కాన్పూర్ కు చెందిన వరుడితో వివాహం నిశ్చయమయ్యింది. పెళ్లికి వరుడి తరుపు వారంతా ముహూర్తం టైం కు ఉన్నావ్ చేరుకున్నారు. పెళ్లి కొడుకు,పెళ్లి కూతురు పీటల మీద కుర్చున్నారు. అంతా సందడి సందడిగా ఉంది. మరి కొద్ది సేపట్లో వరుడు, వధువు మెడలో మూడు ముళ్లు వేసేందుకు సంతోషంతో ఉన్నాడు. ఇంతలో ఉన్నట్టుండి వరుడు పెళ్లి పీటల మీద కళ్లు తిరిగి పడిపోయాడు.

అందరూ అతడికి సపర్యలు చేయసాగారు. మొహం మీద నీళ్లు చల్లారు. గాలి తగలటానికి వీలుగా అతడిని విశాలంగా ఉన్న చోటకు తీసుకు వచ్చారు. ఇబ్బంది లేకుండా ఉండేందుకు తలపాగా తీశారు. దానితో పాటు అతను పెట్టుకున్న విగ్గు కూడా ఊడి వచ్చి బట్టతల బయట పడింది. అంతే అతని బండారం బట్ట బయలయ్యింది. అందరూ ఆశ్చర్య పోయారు. ఈవిషయం తెలుసుకున్న పెళ్లి కూతురు ఆ వరుడిని పెళ్లి చేసుకోటానికి ఇష్టపడలేదు. పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లి పోయింది.

వరుడు తనకు బట్ట తల ఉన్నవిషయం దాచి పెట్టి పెళ్లి కుదుర్చుకున్నాడు. ఇరు వైపులా వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా కానీ పెళ్లి కూతురు పట్టు వీడలేదు. అబద్దం చెప్పి పెళ్లి చేసుకోవాలని చూసిన వ్యక్తిని తిరస్కరించింది. వ్యవహారం పోలీసు స్టేషన్‌కు చేరింది. పోలీసులు నచ్చ చెప్పినా వధువు అంగీకరించలేదు. పెళ్లి కూతురు తరుఫు వారు అప్పటి వరకు ఖర్చు పెట్టిన నగదును ఇచ్చి వరుడి తల్లి తండ్రులు వెనక్కు తిరిగి వెళ్ళారు.