హెల్మెట్ పెట్టుకుని కారు డ్రైవింగ్..ఎందుకో తెలుసా..

  • Publish Date - February 18, 2020 / 11:21 AM IST

హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపితే పోలీసులు ఫైన్ వేయటం సర్వసాధారణం.ఈ రూల్ బైక్ నడిపే వ్యక్తుల సేఫ్టీ కోసం పెట్టిన రూల్. ఇది మంచిదే..ఒప్పుకుంటాం. కానీ హెల్మెట్ పెట్టుకోకుండా కారు నడిపినందుకు ఫైన్ వేసిన పోలీసులు నిర్వాకానికి ఓ వ్యక్తి తనస్టైల్లో ఎలా నిరసన తెలిపాడో తెలిస్తే..వినటానికి చూడటానికి ఫన్నీగా అనిపించినా..కరెక్టే అనిపిస్తుంది.

ఉత్తరప్రదేశ్ లోని హనీర్ పూర్ జిల్లాలోని మన్నాగావ్ కు చెందిన ప్రశాంత్ తివారీకి తన మొబైల్ ఫోన్ లో వచ్చిన మెసేజ్ చూసి షాక్ అయ్యాడు. 2019 నవంబర్ 30న హెల్మెట్ లేకుండా తన మహీంద్రా బొలెరో కారును నడిపినందుకు తనకు రూ.500ల జరిమానా విధించినట్లుగా ఆర్టీవో డిపార్ట్ మెంట్ వారు పంపించిన మెసేజ్ చూసి షాక్ అయ్యారు. ఇదేంటీ..ఇదేం గోలరా బాబూ అనుకున్నారు ప్రశాంత్ తివారీ. 

కొత్త మోటారు వాహన చట్టం అమలులోకి వచ్చిననాటి నుంచి ఇటువంటి వింత విచిత్రమైన వార్తలు వింటూనే ఉన్నాం. అటువంటిదే యూపీలోని ప్రశాంత్ తివారీకి విధించిన ఫైన్ కూడా. 
కానీ..ఇదే కొత్త పిచ్చి రూల్ అనుకున్న ప్రశాంత్ తివారీ ఊరులోలేదు. అంతకంటే కొత్తగా నిరసన తెలపాలనుకున్నాడు. దీంతో అతను తన కారులో ఎక్కడకు వెళ్లినా కారు సీట్ బెల్ట్ పెట్టుకుని హెల్మెట్ పెట్టుకుని కారు డైవ్ చేసుకుంటూ వెళుతున్నారు. ఇది చూసిన మీడియా ఇదేంటీ హెల్మెట్ పెట్టుకుని కారు డ్రైవ్ చేస్తున్నారు. అని అడిగ్గా ఈ విషయాలన్నీ చెప్పారు ప్రశాంత్ తివారీ.