అయోధ్య యూనివర్శిటీలో ‘గర్భ విజ్ఞాన సంస్కర్’ కోర్సు

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 08:01 AM IST
అయోధ్య యూనివర్శిటీలో ‘గర్భ విజ్ఞాన సంస్కర్’ కోర్సు

Updated On : January 7, 2020 / 8:01 AM IST

అయోధ్యలోని రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం (RMLU) కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. సైన్స్ ఎంతో స్పీడ్ గా డెవలప్ అవుతోంది. ఈ క్రమంలో తల్లి కడుపులో ఉన్న పిండాన్ని మానసికంగా ఎలా బలోపేతం చేయాలి. దానికి గర్భంతో ఉన్న మహిళలు (కాబోయే తల్లులు)  దానికి తల్లులు ఏం చేయాలి? ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి ప్రత్యేక అలవాట్లను చేసుకోవాలి? అనే అంశంపై కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. 

‘గర్భా విజ్ఞాన సంస్కర్’ (పిండం విద్యను అభ్యసించే శాస్త్రం)పై RMLU మూడు-ఆరు నెలల సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించనుంది. ఈ విషయంపై యూనివర్శిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ జనవరి 10 న ప్రకటించనుంది. 

ఈ సందర్భంగా  వైస్ ఛాన్సలర్ మనోజ్ దీక్షిత్ మాట్లాడుతూ..గుజరాత్‌లోని కొన్ని యూనివర్శిటీలు ఇప్పటికే ఈ అంశంపై డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టాయనీ..గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గత సంవత్సరం కాన్వొకేషన్‌ కు హాజరైన సందర్భంగా ప్రతిపాదించారనీ దీంతో తాము ఆర్‌ఎమ్‌ఎల్‌యు ఈ కోర్సును ప్రవేశ పెట్టి మొదట సర్టిఫికేట్ అందించనుందని తెలిపారు. 

“హిందూ సంస్కృతిలో 16 విభిన్న సంస్కృతులున్నాయి. దీంట్లో గర్భ సంస్కర్‌కు శాస్త్రీయ ప్రాముఖ్యత కూడా ఉందని దీక్షిత్ తెలిపారు. సంప్రదాయ, ఆధునిక శాస్త్రాల సమ్మేళనంతో యోగా థెరపీ విభాగం ఈ కోర్సును చేపట్టనుందని తెలిపారు.

తల్లి గర్భంలో ఉణ్న పిండం అభివృద్ధిలో ఆశించే తల్లి  ఆశలు..ఆశయాలు..ఆకాంక్షలు..ఆలోచనలు బిడ్డ ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తాయని వైద్య శాస్త్రం కూడా రుజువు చేసింది. అందువల్ల, ఈ కోర్సు పురాతన,ఆధునిక శాస్త్రాలను మేళవించి..చక్కటి పురోగతి సాధించాలని మేము ప్లాన్ చేస్తున్నామని దీక్షిత్ అన్నారు.

ఈ కోర్సును కేవలం విద్యార్ధులు మాత్రమే కాదు..తల్లులతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా నేర్చుకోవచ్చని తెలుసుకోవచ్చని అన్నారు. ఇది భవిష్యత్ తరాల్లో పుట్టే బిడ్డలకు ఎంతగానో ఉపయోగపడుతుందనీ..పిండంగా ఉన్నబిడ్డలు రేపటి తరాలుగా వెలుగుతారని వారు మానసికంగా బలంగా ఉంటే వారి భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. 

కాగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో BHU (బనాసర్ హిందూ యూనివర్సిటీ) ఈ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో యూపీలో ఉండే యూనివర్శిటీల్లో ఇంకా ఇటువంటి కోర్సులు ఎన్ని రానున్నాయో.