Uttar Pradesh: గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఉండేందుకు లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి

ఉత్తరప్రదేశ్‍లోని ప్రయాగ్ రాజ్‌కు చెందిన యువతి.. తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి బతకాలని లింగమార్పిడి చేయించుకుంది. లెస్బియన్లుగా ఉన్న వారి రిలేషన్‌షిప్‌కు ఇరు కుటుంబాల పెద్దలు నిరాకరించారు. ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ ఉండటంతో ఎటువంటి ఇబ్బందినైనా ఎదుర్కొనేందుకు రెడీగా అయ్యారు.

Uttar Pradesh: గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఉండేందుకు లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి

Gender Change

Updated On : June 27, 2022 / 2:17 PM IST

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‍లోని ప్రయాగ్ రాజ్‌కు చెందిన యువతి.. తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి బతకాలని లింగమార్పిడి చేయించుకుంది. లెస్బియన్లుగా ఉన్న వారి రిలేషన్‌షిప్‌కు ఇరు కుటుంబాల పెద్దలు నిరాకరించారు. ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ ఉండటంతో ఎటువంటి ఇబ్బందినైనా ఎదుర్కొనేందుకు రెడీగా అయ్యారు. ఒకరితో ఒకరిని కలవనీయకుండా కట్టడి చేయడంతో పరిష్కారం గురించి ఆలోచించారు.

నచ్చజెప్పడానికి ప్రయత్నించినా.. వినకపోవడంతో ఓ యువతి లింగమార్పిడికి సిద్ధమైంది.

ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ హాస్పిటల్‌లో డాక్టర్ల టీం సర్జరీ నిర్వహించారు. ఛాతీతో పాటు ఇతర శరీర భాగాలను మార్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో సర్జరీ పూర్తి కావడానికి 1.5సంవత్సరాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. ఆ మహిళకు టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ థెరపీ చేశారు. ఫలితంగా చాతిపై వెంట్రుకలు పెరుగుతాయని వైద్యులు వెల్లడించారు.

Read Also: లింగ మార్పిడి చేయించుకుని యువతిని పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్

లింగమార్పిడి వల్ల సైడ్ ఎఫెక్ట్స్
లింగమార్పిడి తర్వాత ఆ మహిళ గర్భం దాల్చడం వంటి అవకాశాలు కోల్పోయింది. ఇటువంటి ఆపరేషన్ జరగడం ఇదే తొలిసారి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 18నెలల సమయం పడుతుంది. ఆమెకు పూర్తి వైద్య పరీక్షలు జరిపాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు.