లింగ మార్పిడి చేయించుకుని యువతిని పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్

  • Published By: veegamteam ,Published On : February 19, 2020 / 07:33 AM IST
లింగ మార్పిడి చేయించుకుని యువతిని పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్

మహారాష్ట్రంలో కానిస్టేబుల్ గా పనిచేసే లలిత్ సాల్వే అనే లేడీ కానిస్టేబుల్ పురుషుడిగా లింగ మార్పిడి చేయించుకుని  ఆదివారం (ఫిబ్రవరి 16,2020)న ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి స్థానికంగా పెద్ద విశేషంగా మారింది. 

వివరాల్లోకి వెళితే..బీడ్ జిల్లా మజల్ గావ్ మండలం రాజేగామ్ గ్రామంలో 1988 జూన్ లో లలితా కుమారి సాల్వేగా పుట్టిన ఆమె నాలుగేళ్ల క్రితం తన శరీరంలో వచ్చిన మార్పులు గమనించింది. దీంతో ఆమె వైద్య పరీక్షలు చేయించుకుంది. అప్పటికే కానిస్టేబుల్ గా పనిచేస్తున్న లలితా కుమారి సాల్వే తన శరీరంలో వచ్చిన మార్పులకు ఆందోళన చెందింది.

సాల్వే పోలీసు దళంలో విధుల్ని కొనసాగిస్తూ వస్తూన్న క్రమంలో ఆమెలో వచ్చిన మార్పుల రీత్యా ఆమె ఉద్యోగానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఆమె లింగ మార్పిడి చేయించుకోవాలని నిర్ణయించుకుంది. దీనికి ఉన్నతాధికుల పర్మిషన్ కోరింది. దానికి వారు అంగీకరించలేదు. దీంతో లలిత బాంబే హైకోర్టును ఆశ్రయించగా..మహారాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను సంప్రదించాలని సాల్వేను హైకోర్టు సూచించింది. సాల్వేకు సెక్స్ చేంజ్ సర్జరీ చేయటానికి హోంశాఖ సెలవు మంజూరు చేసింది. దీంతో ఆమె ఉద్యోగ సమస్యకు పరిష్కారం లభించింది. అనంతరం ముంబైలోని ఒక ఆసుపత్రిలో మూడు విడతల సర్జరీ తరువాత లలితా కుమారి సాల్వేగా ఉండే ఆమె లలిత్ సాల్వేగా మారింది. 

ముంబైలోని ఒక ఆసుపత్రిలో సెక్స్ ఛేంజ్ చేయించుకుని మహిళ నుంచి పురుషునిగా మారిన పోలీస్ కానిస్టేబుల్ లలిత్ సాల్వే పెళ్లి చేసుకున్నారు. 32 ఏళ్ల లలిత్ అంతకు ముందు లలితగా ఉండేవారు. 2018లో లలిత ముంబైలోని సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో లింగ మార్పిడి ఆపరేషన్  చేయించుకున్నాడు. లలిత్ వివాహం ఔరంగాబాద్‌లోని ఒక దేవాలయంలో అతి కొద్దిమంది బంధుమిత్రులు సమక్షంలో జరిగింది. 

ఈ పెళ్లికి లలిత్ కుటుంబ సభ్యులు..పెళ్లి కూతురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగాగా లలిత్  అలియాస్ లలిత మాట్లాడుతూ..ఎవరి వివాహానికి వెళ్లినా, తనకు ఎప్పుడు పెళ్లి అవుతుందనే ప్రశ్న వేధించేదని అన్నారు. దానికి సమాధానం దొరికిందని తాను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 

గతంలో ఆమె ఏ శుభకార్యాలకు వెళ్లినా తనను వింతగా..విచిత్రంగా చూసేవారనీ..ఏంటీ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావ్..అసలు నీకు పెళ్లి అవుతుందా? అమ్మాయిని చేసుకుంటావా? అబ్బాయిని చేసుకుంటావా? అంటూ అదోలా చూస్తూ ప్రశ్నించేవారని లలిత్ వాపోయాడు. అన్నింటినీ లలితా సాల్వే మౌనంగా భరించేది. ఈ క్రమంలోనే తాను లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. అలా పలు పోరాటాల తరువాత న్యాయపరంగా పర్మిషన్ సాధించి ఎట్టకేలకు మహిళ పుట్టిన పురుషుడిగా మారి ఓ యువతిని వివాహం చేసుకుంది. కాదు కాదు చేసుకున్నాడు. 

Read More>>సీఎం జగన్‌ను జైల్లో పెట్టే దమ్ముందా?