Uttarakhand-Goa : ఒకే విడతలో ఉత్తరాఖండ్‌, గోవా ఎన్నికలు

ఉత్తరాఖండ్‌లో 13 జిల్లాల్లో 70 అసెంబ్లీ స్థానాలకు సింగిల్ ఫేజ్‌లో ఓటింగ్ జరుగుతోంది. 81 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Elections

Uttarakhand and Goa elections : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కీలకంగా ఉన్న ఉత్తరాఖండ్‌, గోవాలో ఓటింగ్‌ కాసేపట్లో మొదలవనుంది. ఉత్తరాఖండ్‌, గోవాలో ఒకే విడతలో నిర్వహిస్తున్నారు. గోవా, ఉత్తరాఖండ్‌లో 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభంకానుంది. ఉత్తరాఖండ్‌లో 13 జిల్లాల్లో 70 అసెంబ్లీ స్థానాలకు సింగిల్ ఫేజ్‌లో ఓటింగ్ జరుగుతోంది. 81 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 632 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 152 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.

11 వేల 697 పోలింగ్ కేంద్రాల్లో 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌కు అనుమతి ఇచ్చింది ఈసీ. ఉత్తరాఖండ్ ఏర్పడిన తర్వాత అయిదవ సారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. 301 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్క బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆప్, టీఎంసీ, శివసేన తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

Uttar Pradesh : ఉత్తర్ ప్రదేశ్ లో ప్రారంభమైన రెండో దశ పోలింగ్

ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికే మొదటి దశ పోలింగ్ జరిగింది. ఇక రెండో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఇప్పటికే అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఇక యూపీలో రెండో దశ కోసం 17 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 9 జిల్లాల్లో 55 అసెంబ్లీ స్థానాల కోసం ఓటింగ్ జరుగుతోంది. 586 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

రెండో దశలో ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో ముస్లింలతో పాటు చెరకు రైతుల ఓట్లు కీలకం. చెరకు బకాయిల అంశం ఎన్నికలపై ప్రభావం చూపనుంది. ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామీ, కాంగ్రెస్ నేత హరీశ్ రావత్‌, ఎస్పీ నేత అజాం ఖాన్‌ భవిష్యత్‌ ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది.