Uttarakhand New Chief Minister : నాలుగు నెలల్లో మూడో ముఖ్యమంత్రి !

ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకోటానికి బీజేపీ శాసనసభా పక్షం డెహ్రాడూన్ లో సమావేశం అయ్యింది.

Uttarakhand New Chief Minister : ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకోటానికి బీజేపీ శాసనసభా పక్షం డెహ్రాడూన్ లో సమావేశం అయ్యింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మదన్ కౌశిక్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో శాసనసభా పక్షనేతను ఎన్నుకోనున్నారు. ఈసమావేశానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్,బిజెపి ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ హాజరుఅయ్యారు. కాగా….ముఖ్యమంత్రి రేసులో బిషన్ సింగ్ చౌపాల్, చౌభత్కల్, ధన్ సింగ్ రావత్,పుష్కర్ సింగ్ ధమి లు ఉన్నారు. తీరథ్ సింగ్ రావత్ నిన్న గవర్నర్‌కు తన రాజీనామా పత్రాన్ని అందచేశారు.

పార్టీలో త్రివేంద్రసింగ్ రావత్ పై తీవ్ర అసమ్మతివ్యక్తం కావటంతో ముఖ్యమంత్రి పీఠం నుంచి ఆయన్ను తప్పించి తీరథ్ సింగ్ రావత్ కు బీజేపీ పగ్గాలు అప్పచెప్పింది. తీరథ్ సింగ్ రావత్ మార్చి 10న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టారు.  పదవి చేపట్టిన ఆరునెలల్లోగా శాసన సభకు ఎన్నిక కావల్సి ఉంది. ప్రస్తుతం వాలుగు నెలలు పూర్తి కాగా సెప్టెంబర్ 10 నాటికి ఆరునెలలు పూర్తవుతుంది.

అయితే రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్ధానాలు ఖాళీగా ఉన్నప్పటికీ … ప్రస్తుతం కరోనా పరిస్ధితుల నేపధ్యంలో ఉపఎన్నికలు జరగటంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. గడువు ముగిసే వరకు తీరథ్ సింగ్ రావత్ పదవిలో ఉంటే రాజ్యాంగపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఆరు నెలల్లోపు ఎమ్మెల్యే గా ఎన్నిక కాలేని పరిస్థితి ఉండడంతో తీరథ్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. గడిచిన నాలుగు నెలల్లో ఉత్తరాఖండ్‌కు మూడో ముఖ్యమంత్రిని ఎన్నుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

సీఎం పదవి పోగొట్టిన కరోనా
ఉత్తరాఖండ్ సీఎం గా మార్చి 10న పగ్గాలు చేపట్టిన తీరథ్ సింగ్ రావత్ విచిత్ర పరిస్ధితిని ఎదుర్కోన్నారు. పదవి చేపట్టిన  తర్వాత ఆయన సీఎం నివాసావికి కూడా వెళ్లలేదు. కరోనా ఆయన పాలిట శాపమయ్యింది. మార్చి 22 న తీరథ్ కు కోవిడ్ సోకింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు.  కానీ మార్చి 23న కేంద్ర ఎన్నికల సంఘం సాల్ట్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక ప్రకటించింది.

కోవిడ్ సోకటం వలన ఆసమయంలో తీరథ్ ఆ స్ధానం నుంచి పోటీ చేయలేకపోయారు. వాస్తవానికి సాల్ట్ స్ధానం నుంచి తీరథ్ ను గెలిపించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. కానీ రెండు వారాలు హోం ఐసోలేషన్ లో ఉన్నతీరథ్ ఏప్రిల్ 4న బయటకు వచ్చారు.  దీంతో నామినేషన్ వేసే గడువు ముగిసిపోవటంతో తీరథ్ ఇరకాటంలో పడ్డారు.  ఏప్రిల్ 17న జరిగిన సాల్ట్ నియోజక వర్గం ఉప ఎన్నికలో బీజేపీ సునాయాసంగా సీటు గెలుచుకుంది. కోవిడ్ వల్ల పోటీ చేయలేక పోయిన తీరథ్ కు తీవ్ర నిరాశ మిగిలింది.

ట్రెండింగ్ వార్తలు