ముస్సోరీ : IAS అకాడమీలో కరోనా కలకలం..33మంది ట్రైనీలకు పాజిటివ్

  • Published By: nagamani ,Published On : November 21, 2020 / 02:48 PM IST
ముస్సోరీ : IAS అకాడమీలో కరోనా కలకలం..33మంది  ట్రైనీలకు పాజిటివ్

Updated On : November 21, 2020 / 3:25 PM IST

Uttarakhand Mussoorie IAS Academy 33 trainees Corona positive : ఉత్త‌రాఖండ్‌లోని ముస్సోరీలో ఐఏఎస్ అకాడమీలో కరోనా వైరస్ కలకలం రేపింది. ల్‌బ‌హ‌దూర్ శాస్త్రి నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అడ్మినిస్ట్రేష‌న్‌లో ఉన్న 33 మంది ట్రైనీల‌కు క‌రోనా వైర‌స్ సోకింది. దీంతో ముస్సోరీలో ఉన్న ఐఏఎస్ అకాడ‌మీని రెండు రోజుల పాటు మూసివేశారు.



కొంతమంది ట్రైపీలరే క‌రోనా వైర‌స్ లక్షణాలు కనిపించటంతో అందరికీ ప‌రీక్ష‌లు చేయగా వారిలో 33 మంది ట్రైనీలు పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు ద్రువీక‌రించారు.



భారీ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు తేల‌డంతో.. హోట‌ళ్లు, మెస్‌, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు, లైబ్ర‌రీని శానిటైజ్ చేశామ‌ని అకాడ‌మీ డైర‌క్ట‌ర్ సంజీవ్ చోప్రా తెలిపారు.


కాగా.. ముస్సోరీలోని ఐఎఎస్ క్యాంప్ లో 428మంది ట్రైనీలు ఉన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలతో నిబంధనలు పాటిస్తున్నాగానీ కరోనా సోకటం గమనించాల్సిన విషయం. భారత్ లో కరోనా కేసులు 90 లక్షలకు చేరుకున్నాయి.