Vaccines Worth Rs 25 Lakhs Damaged In Fire At Indore Godown
indore vaccines worth rs.25 lakhs damaged fire godown : భారత్ లో ఓ పక్క కరోనా వ్యాక్సిన్ కొరత కొనసాగుతున్న క్రమంలో మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్‌లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా రూ.25 లక్షల వ్యాక్సిన్లు అగ్నికి ఆహుతి అయిపోయాయి. భారత్‌లో కరోనా కేసులు, మరణాలు భారీ సంఖ్యలో పెరిగిపోతు ఈ సమయంలో ఈ అగ్నిప్రమాదం ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ దొరక్క కోవిడ్ భాదితులు ప్రాణాలు పోతున్నాయి.
అడపా దడపా ఆక్సిజన్ లీక్ అవుతున్నాయి. అలాగే దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత ఉన్న క్రమంలో కూడా వ్యాక్సిన్ కొరత ఏర్పడుతోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇండోర్‌లోని భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్‌లో భారీ అగ్నిప్రమాదంలో వ్యాక్సిన్లు దగ్థమైపోయాయి.
కంపెనీ గోడౌన్‌లో నిల్వ ఉంచిన కరోనా మెడిసిన్స్, వ్యాక్సిన్‌తో పాటు బ్లాక్ ఫంగస్‌కు ఉపయోగించే మెడిసిన్స్ కూడా పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం వల్ల రూ. 25 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు కంపెనీ యాజమాన్యం ప్రాథమికంగా నిర్ధారించింది.