బాలీవుడ్ లో కరోనా సోకిన మొదటి వ్యక్తి గాయని కనికా. ఈ విషయాన్ని ఇవాళ ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇటీవల లండన్ కు వెళ్లిన కనికా ఈ నెల 15న లక్నో తిరిగి వచ్చారు. అయితే ఆమె తన ట్రావెల్ హిస్టరీ గురించి అధికారులకు తెలియజేయలేదు. అయితే కనికా ఇటీవల లక్నోలో ఓ డిన్నర్ పార్టీకి హాజరయ్యారు. అయితే ఆ పార్టీకి హై ఫ్రొఫైల్ వ్యక్తులు కూడా హాజరయ్యారు.
డిన్నర్ పార్టీకి హాజరైన వారిలోరాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే,ఆమె కుమారుడు ఎంపీ దుష్యంత్ సింగ్,పలువురు ప్రముఖులు,బ్యూరోక్రాట్ లు,సెలబ్రిటీలు కూడా ఈ డిన్నర్ పార్టీలో పాల్గొన్నారు. పార్టీకి హాజరైన ప్రముఖులతో కనికా సెల్ఫీలు తీసుకున్నారు,షేక్ హ్యాండ్ లు ఇచ్చారు. మరోవైపు ఆ పార్టీకి హాజరైన మరుసటి రోజు ఎంపీ దుష్యంత్ సింగ్ పార్లమెంటు సెంట్రల్‌హాలులో ఎంపీ నిశికాంత్, మనోజ్ తివారీతో భేటీ అయ్యి, ముచ్చటించారు.
అయితే ఇప్పుడు కనికాకు కరోనా పాజిటివ్ అని రావడంతో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే,ఆమె కుమారుడు ఎంపీ దుష్యంత్ సింగ్ స్వయంగా క్వారంటైన్(నిర్భందం)లోకి వెళ్లిపోయారు. ముందస్తు జాగ్రత్తగా క్వారంటైన్ లోకి తక్షణమే వెళ్లిపోయినట్లు వసుంధరా రాజే తెలిపారు. తాము అన్ని ముందు ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. సింగర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ పార్టీకి హాజరైన వారందరూ స్వయంగా క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాలని, ఏవైనా కరోనా లక్షణాలుంటే వెంటనే తమకు తెలియజేయాలని అధికారులు సూచించారు.
Vasundhara Raje,BJP leader:While in Lucknow,I attended a dinner with my son Dushyant&his in-laws. Kanika, who has unfortunately tested positive for #Covid19 was also a guest. As a matter of abundant caution, my son&I have immediately self-quarantined&we’re taking all precautions. pic.twitter.com/MD3r0XZXu4
— ANI (@ANI) March 20, 2020
Also Read | కరోనా కట్టడికి ఐసోలేషన్ ఒకటే మార్గం.. చైనా అదే పనిచేసింది!