G Ram G: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) బిల్లు ఇవాళ చట్టరూపం దాల్చింది. వీ బీ జీ రామ్ జీ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించడంతో చట్టంగా అమల్లోకి వచ్చింది.
ఇటీవలే పార్లమెంట్లో వీ బీ జీ రామ్ జీ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దీంతో దాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు పంపగా ఆమె ఆమోదముద్ర వేశారని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది.
యూపీఏ హయాంలో తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో వీ బీ జీ రామ్ జీ చట్టాన్ని అమలు చేయనున్నారు. ఈ కొత్త పథకాన్ని వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణాభివృద్ధి కోసం తీసుకొచ్చినట్లు కేంద్ర సర్కారు చెబుతోంది.
Also Read: అందుకే కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడారు: మంత్రి ఉత్తమ్ రియాక్షన్
ఇకపై ఏయే ప్రయోజనాలు అందుతాయి?
భారత్‌లో 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA ) తీసుకొచ్చింది. ఇప్పుడు ఎంజీఎన్ఆర్‌ఈజీఏను రద్దు చేసి ఆ పథకం స్థానంలో వీ బీ జీ రామ్ జీ చట్టాన్ని ఎన్డీఏ సర్కారు తీసుకొచ్చింది. గ్రామీణ ఉపాధి, జీవనోపాధి లక్ష్యాలతో దీన్ని అమలు చేస్తారు.