Veg-Non Veg At IIT Bombay : ఇక్కడ శాకాహారులే మాత్రమే కూర్చోవాలి .. బాంబే ఐఐటీలో వెజ్-నాన్ వెజ్ వివాదం

మాంసాహారం తినే విద్యార్ధులపై క్యాంటిన్ నిర్వాహకులు వివక్ష చూపుతున్నారంటూ బాంబే IIT క్యాంటీన్ లో వివాదం చెలరేగింది. శాఖాహారులు మాత్రమే ఇక్కడ కూర్చోవాలి అనే పోస్టర్ పై వివాదం జరుగుతోంది.

Veg-Non Veg At IIT Bombay

IIT Bombay..Veg-Non Veg : బాంబే ఐఐటీ (IIT Bombay)లో శాఖాహారులు, మాంసాహారులు (Veg-Non Veg) వివాదం రాజుకుంది. హాస్టల్ క్యాంటీన్ లో ‘ఇక్కడ శాఖాహారులు మాత్రమే కూర్చోవాలి’ అనే నోటీస్ ఏర్పాటు చేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హాస్టల్ క్యాంటీన్ లో మాంసాహారం తిన్న ఓ విద్యార్థిని మరో విద్యార్ధి అవమానించిన ఘటన చోటు చేసుకుంది. ఈక్రమంలో ‘ఇక్కడ శాఖాహారులు మాత్రమే కూర్చోవాలి’అని రాసి పెట్టిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గత వారం హాస్టల్ 12లో ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాంసాహారం తినే విద్యార్ధులపై క్యాంటిన్ నిర్వాహకులు వివక్ష చూపుతున్నారంటూ వివాదం చెలరేగింది. ఈ విషయంపై పలువురు విద్యార్ధలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘వెజిటేరియన్లు మాత్రమే ఇక్కడ కూర్చోవడానికి అనుమతిస్తామని’ రాసిన పోస్టర్లను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఇది కాస్తా రచ్చ రచ్చగా మారింది. వర్శఇటీ క్యాంటీన్ గోడలపై ‘వెజిటేరియన్లు మాత్రమే ఇక్కడ కూర్చోవడానికి అనుమతిస్తామని’ రాసి పెట్టటం మాంసాహారుల్ని అవమానించటమేనని అంటున్నారు పలువురు విద్యార్ధులు.

ఒకవేళ మాంసం తినేవారు ఎవరైనా ఆ ప్లేస్ లో కూర్చుంటే అక్కడ కూర్చోవద్దని చెప్పటమే కాకుండా అవమానకరంగా మాట్లాడి అక్కడి నుంచి బలవంతంగా లేపేస్తున్నారని వాపోతున్నారు. మూడు నెలల క్రితం వెజ్‌, నాన్‌వెజ్‌పై నిబంధనలు ఏవైనా ఉన్నాయా? అనే విషయంపై సమాచార హక్కు చట్టం ద్వారా విద్యార్థులు అడిగిన ప్రశ్నకు.. విద్యార్థులు ఆహారం తినే విషయంలో ఎటువంటి విభజన లేదని సమాధానం వచ్చిందని అయినా హాస్టల్ క్యాంటీన్ ఇటువంటి వివక్ష ఏంటీ అంటూ ఓ విద్యార్ధి ప్రశ్నిస్తున్నాడు. ఇటువంటివి మాంసం తినే విద్యార్ధులను అవమానించినట్లేనని కొంతమంది విద్యార్ధులు పోస్టులు పెడుతున్నారు. ఇలా బాంబే ఐఐటీలో మాంసాహారులు, శాఖాహారులు వివాదంగా మారింది.