నరకం చూశారు..! ప్రయాణికులకు చెమట్లు పట్టించిన విమానం, అసలేం జరిగిందంటే..

విమానంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకుపైగా ఉందని చెబుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు పడ్డ బాధ వర్ణనాతీతం.

SpiceJet Passengers Suffer : ఢిల్లీ నుంచి దర్బంగా వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో ఏసీ పని చేయక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండ వేడిమికి విమానంలో ఏసీలు ఒక్కసారిగా మొరాయించాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విమానంలో ఏసీ తిరిగి స్టార్ట్ కావడానికి గంటకుపైగా సమయం పట్టింది. ఆ గంట సేపు ప్రయాణికులు నరకం చూడాల్సి వచ్చింది.

తీవ్ర ఉక్కపోతకు గురైన ప్రయాణికులంతా ఒక్కసారిగా విమాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులు, చిన్న పిల్లలు పడ్డ బాధ వర్ణనాతీతం. తీవ్రమైన వేడితో పాటు ఆన్ బోర్డులో తగినంత వెంటిలేషన్ లేకపోవడం ప్రయాణికులకు ఊపిరి ఆడకుండా చేసింది. విమానంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకుపైగా ఉందని చెబుతున్నారు. చివరికి చేతిలో ఉన్న పేపర్లు, మ్యాగజైన్లతో గాలి ఊపుకుంటూ ఉపశమనం పొందాల్సి వచ్చిందని ప్యాసింజర్లు వాపోయారు. జీవితంలో ఇలాంటి భయానక అనుభవాన్ని చూడలేదని ప్రయాణికులు వాపోయారు. నరకం అంటే ఏంటో కళ్లారా చూశామని ఆవేదన వ్యక్తం చేశారు.

అసలే ఎండలు దంచికొడుతున్నాయి. ఇక విమానంలో వెంటిలేషన్ అంతంత మాత్రమే. దీనికి తోడు ఏసీలు పని చేయకపోవడంతో ప్యాసింజర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఉక్కపోతతో విలవిలలాడారు. ఒళ్లంతా చెమటలు పట్టేసి బాగా అవస్థ పడ్డారు. చల్లని గాలి అందక కొందరు ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఈ అనుభవాన్ని జీవితంలో మర్చిపోలేము అని అంటున్నారు. విమానం బయలుదేరడానికి ముందే అన్ని సౌకర్యాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకునే బాధ్యత సిబ్బందికి లేదా? అని మండిపడుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి తమను చాలా ఇబ్బంది పెట్టారని వాపోయారు.

Also Read : ఘోర ప్రమాదం.. కారు రివర్స్ చేస్తూ లోయలో పడి యువతి మృతి, వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు