Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధ‌న్‌ఖ‌ర్‌కు అస్వస్థత.. హుటాహుటీన ఎయిమ్స్‌కు తరలింపు..

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ ఎయిమ్స్ లో చేరారు.

Vice president Jagdeep Dhankhar

Vice president Jagdeep Dhankhar: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధ‌న్‌ఖ‌ర్‌ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. ఛాతీ నొప్పి కారణంగా ఆదివారం తెల్లవారుజామున 2గంటల సమయంలో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఎయిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ పర్యవేక్షణలో ధంఖర్ ను సీసీయులో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు.  ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్య బృందం తెలిపింది. ధన్కర్ అస్వస్థత విజయం తెలిసిన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎయిమ్స్ కు వెళ్లి ఆయన్ను పరామర్శించారు.