Vice President polls: ఉప రాష్ట్రపతి ఎన్నికలు.. NDA అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరు ప్రకటన.. ఆయన ఎవరంటే?

Vice President polls: రాధాకృష్ణన్ పేరును ఖరారు చేస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు.

CP Radhakrishnan

భారతీయ జనతా పార్టీ ఆదివారం మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అభ్యర్థిగా ప్రకటించింది. రాధాకృష్ణన్ పేరును ఖరారు చేస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు.

“తదుపరి ఉప రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని మేము కోరుతున్నాం. ప్రతిపక్ష నేతలతో చర్చలు జరిపాం” అని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు.

“CP రాధాకృష్ణన్ ఒక స్టేట్స్‌మన్‌. తమిళనాడులో అన్ని వర్గాల నుంచి గౌరవం పొందారు” అని ఆయన అన్నారు.

Also Read: Arjun Tendulkar News: అర్జున్ టెండూల్కర్‌కి కాబోయే భార్య ఈమే.. ఆస్తులు.. బయోగ్రఫీ.. అబ్బో చాలా పెద్ద ఫ్యామిలీ..

రాజకీయాల్లో రాధాకృష్ణన్ ప్రస్థానం

చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్ 1957, అక్టోబర్ 20న జన్మించారు. 2024 జూలై 31 నుంచి మహారాష్ట్ర 24వ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి 2024 జూలై వరకు ఝార్ఖండ్ గవర్నర్‌గా, 2024 మార్చి నుంచి జూలై వరకు తెలంగాణ గవర్నర్ (అదనపు హోదా), పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ (అదనపు హోదా)గా పనిచేశారు.

ఆయన భారతీయ జనతా పార్టీ (BJP) సభ్యుడిగా కోయంబత్తూరు నుంచి రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యాడు. తమిళనాడు BJP రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

నెక్స్ట్‌ ఏంటి?

జూలై 21న అనారోగ్య కారణాలు చూపుతూ ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌కర్ అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో రాజకీయ విభేదాలపై ఊహాగానాలు వెలువడ్డాయి.

లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీలో ఎన్డీఏకి మెజారిటీ ఉండడంతో, ఎన్నిక జరిగితే ఆ కూటమి విజయం లాంఛనమేనని భావిస్తున్నారు. ప్రతిపక్ష INDIA బ్లాక్ అభ్యర్థిని త్వరలోనే ప్రకటించే అవకాశముంది. ఆగస్టు 18న చర్చలు జరగనున్నాయి.

NDAకి చెందిన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులను ఆగస్టు 21న నామినేషన్ దాఖలు కోసం ఢిల్లీకి రమ్మన్నారు.