Vice President Election
Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పార్లమెంటు నూతన భవనంలోని ఎఫ్-101 వసుధలో ఇవాళ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. Vice President Election బ్యాలెంట్ పద్దతిలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. సాయంత్రం 6గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. రాత్రి 7 గంటల తరువాత విజేతలను ప్రకటిస్తారు.
Also Read: EVMs: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలు ఎందుకు ఉపయోగించరు.. కారణం ఏంటి..
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ బరిలో నిలవగా.. ప్రతిపక్ష కూటమి అభ్యర్థిగా తెలంగాణ వాసి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు.
పార్లమెంట్ ఉభయసభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788కాగా.. ఏడు స్థానాలు ఖాళీ కావడంతో ప్రస్తుతం 781 మంది సభ్యులు ఉన్నారు. అయితే, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి నలుగురు, బీజేడీకి ఏడుగురు రాజ్యసభ సభ్యుల బలం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో 386 ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలవనున్నారు.
లోక్‌సభలో మెజార్టీ ఉన్నందున ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. గణాంకాలను పరిశీలిస్తే.. ఎన్డీయేకు 425 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ, ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య 438కి మించే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి 314 మంది ఎంపీల మద్దతు ఉంది.ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది. అయితే, పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేయొద్దని ఇప్పటికే ఎన్నికల సంఘం స్పష్టమైన ప్రకటన చేసింది. దీంతో ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేసే అవకాశం ఉంటుంది. దీంతో క్రాస్ ఓటింగ్‌పై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది.