Beggar buying IPhone
Beggar buying IPhone : ఐ ఫోన్ అంటే జనాల్లో మామూలు క్రేజ్ ఉండదు. లగ్జరీ ఫోన్ తమ చేతుల్లో ఉండాలని చాలామంది కోరుకుంటారు. కానీ కాస్ట్లీ ఫోన్ చేతికి రావాలంటే మాటలు కాదు కదా.. ఓ బిచ్చగాడు ఐ ఫోన్ మీద మనసు పెట్టాడు. మొత్తం చిల్లర తీసుకుని స్టోర్‌కి వెళ్లాడు. అతని దగ్గర అంత డబ్బులున్నాయా? అసలు అతని అవతారం చూసి స్టోర్ వాళ్లు లోనికి రానిచ్చారా? మీ డౌట్లు తీరాలంటే స్టోరీ చదవండి.
Beggars Corporation : యాచకులకు దానం చేయొద్దు .. పెట్టుబడి పెట్టమంటున్న బెగ్గర్స్ కార్పొరేషన్
ఓ బిచ్చగాడు ఐ ఫోన్ మీద మనసు పడి డబ్బులుండి కొనడానికి స్టోర్‌కి వెళ్తే దుకాణం వాళ్లు లోనికి రానిస్తారా? ‘ఎక్స్‌పెరిమెంట్ కింగ్’ అనే యూట్యూబ్ ఛానెల్ వారికి ఇదే డౌట్ వచ్చింది. అంతే ఓ ప్లాన్ వేసేసారు. ఒక యువకుడితో బిచ్చగాడి వేషం వేయించారు. ఆ యువకుడు సంచి నిండా చిల్లర డబ్బులు వేసుకుని జోధ్‌పూర్ వీధుల్లో స్టోర్స్ అన్నీ తిరగడం మొదలుపెట్టాడు. కొందరు రానివ్వలేదు.. మరికొందరు రానిచ్చినా అంత చిల్లర మేము తీసుకోలేం అని పంపించేసారు. ఎట్టకేలకు ఓ షాపు యజమాని అతని దగ్గర ఉన్న చిల్లర తీసుకుని అతను కావాలనుకున్న ఐ ఫోన్ ప్రో మ్యాక్స్ (IPhone 15 Pro Max ) ఇచ్చాడు. అప్పుడు ఆ యువకుడు తాను బిచ్చగాడిని కాదని.. తాము సరదాగా ప్రాంక్ చేసినట్లు రివీల్ చేసాడు.
Viral Video : హైటెక్ బిచ్చగాడు.. విమానంలో భిక్షాటన చేసిన వ్యక్తి వీడియో వైరల్
వీడియో చూసిన నెటిజన్లు బిచ్చగాడు ఐ ఫోన్ కొనడమేంటని? మొదట ఆశ్చర్యపోయారు. అసలు షాపు యజమానికే ప్రాంక్ చేస్తున్నాడని తెలీకుండా అంతలా నటించాడు ఆ యువకుడు. ప్రాంక్ అని తెలిశాక షాపు యజమానులు సరదాగానే తీసుకున్నారు. అతనితో కలిసి ఫోటోలు, వీడియోలు దిగారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కొందరు ఫన్నీ కామెంట్లు చేయగా.. ఇవన్నీ జమానా స్టంట్స్ అని.. కొత్తగా ఏదైనా చేయమని సూచించారు.
Chillara ichi #iPhone15Pro konnadu ??pic.twitter.com/JCFY82GKP8
— R a J i V (@RajivAluri) October 9, 2023