Barbie Dolls making video
Barbie Dolls making video : చిన్నతనంలో బొమ్మలతో ఆడుకున్న అనుభవం అందరికీ ఉంటుంది. అందులో బార్బీ బొమ్మలతో ఆడుకోని పిల్లలు ఉండరు. వాటిని ఎలా తయారు చేస్తారు? అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాటి తయారీ వీడియో చూడండి.
Dried Mango Slices : మామిడి ఒరుగుల తయారీ.. 3 నెలల్లో 12 కోట్ల టర్నోవర్
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అలీఫ్ మిద్ద్యా (kolkatareviewstar) తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసిన బార్బీ డాల్ మేకింగ్ వీడియో వైరల్‌గా మారింది. ‘ఫ్యాక్టరీలో బార్బీ డాల్స్ మేకింగ్’ అనే శీర్షికతో ఈ వీడియోను షేర్ చేసారు. బొమ్మల ముఖం, వాటి బాడీ తయారు చేయడానికి కరిగిన ద్రవాన్ని అచ్చులలో పోయడంతో వీడియో స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత బొమ్మ తయారీని దశల వారీగా చూపించారు. చివర్లో వాటిని ప్యాక్ చేయడంతో వీడియో క్లోజ్ అవుతుంది. ఈ పోస్ట్‌కు 14 మిలియన్ల కంటే ఎక్కువమంది చూసారు. చాలామంది వీటిని చూసి తమ చిన్నతనాన్ని గుర్తు చేసారని అభిప్రాయపడ్డారు.
Cow Based Products : సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి గోశాల ఏర్పాటు.. గో ఆధారిత ఉత్పత్తుల తయారీ
బార్బీ బొమ్మలలో సాధారణ స్ధాయి ధరల నుంచి క్లాస్ట్లీ బొమ్మలు కూడా ఉంటాయి. వీటిని ఇష్టపడని వారు.. వీటితో ఆడని వారు ఉండరు. ఫ్యాక్టరీలో బార్బీ బొమ్మల తయారీ చూసిన నెటిజన్లు ‘నాకు ఇష్టమైన చిన్ననాటి బార్బీ’ అని.. ‘మా బాల్యాన్ని గుర్తు చేసారని’ కామెంట్లు పెట్టారు.