Viral Video : ఒకరు పేపర్ బ్యాగ్.. మరొకరు కుందేలు బొమ్మ.. ఇవేమి హెల్మెట్లు భయ్యా.. షాకైన పోలీసులు

బైక్ మీద హెల్మెట్ కంపల్సరీ అంటే వింత హెల్మెట్లు ధరిస్తూ వైరల్ అవుతున్నారు కొందరు వ్యక్తులు. పోలీసులకు షాక్ ఇస్తున్నారు.

Viral Video

Viral Video : బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. కాదని నిబంధనలు పాటించకపోతే చలాన్లూ కంపల్సరీ. ఇటీవల కాలంలో డ్రైవ్ చేసేవారే కాకుండా వారి వెనుక ప్రయాణించేవారు కూడా హెల్మెట్లు పెట్టుకుంటున్నారు. అయితే చిత్ర విచిత్రమైన హెల్మెట్లు వాడుతూ కొందరు వ్యక్తులు వైరల్ అవుతున్నాయి.

PM Narendra Modi: డ్రెస్సింగ్ రూంకు వెళ్లి టీమిండియా సభ్యులను ఓదార్చిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్

Desi Bhayo అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి కుందేలు బొమ్మను పోలిన హెల్మెట్ ధరించినట్లు కనిపించింది. పోలీసు అతనితో ‘నువ్వు కుందేలువా?’ అని నవ్వుతూ అడుగుతారు. ‘కొందరు హెల్మెట్ పెట్టుకోరు.. మరికొందరు ఇలాంటి హెల్మెట్ పెట్టుకుంటున్నారు. బాగున్నాయి..’ అని మళ్లీ పోలీసు అనడంతో అక్కడ వారు నవ్వుతున్నట్లు వీడియోలో కనిపించింది. ఆ తర్వాత పోలీసు కెమెరా, హెల్మెట్ స్పెసిఫికేషన్ గురించి అక్కడి వ్యక్తులకు సూచించారు. ఈ వీడియో ఎక్కడ రికార్డైందనేది క్లారిటీ లేదు.

Australian Deputy PM : ఢిల్లీ వీధుల్లో నిమ్మరసం తాగిన రిచర్డ్ మార్లెస్…వీడియో వైరల్

కొద్దిరోజుల క్రితం బెంగళూరులో ఒక వ్యక్తి బైక్ నడుపుతుంటే అతని వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్‌కు బదులు పేపర్ బ్యాగ్ ధరించి కనిపించాడు. ‘ఇదేం హెల్మెట్?’ అనే శీర్షికతో ThirdEye అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఈ పోస్టు ఇంటర్నెట్‌లో నవ్వులు పూయించింది. హెల్మెట్ ధరించడండి రా బాబు.. అని పోలీసులు మొత్తుకుంటుంటే.. ఇలాంటి చిత్ర విచిత్రాలు చేస్తున్నారు జనం.