PM Narendra Modi: డ్రెస్సింగ్ రూంకు వెళ్లి టీమిండియా సభ్యులను ఓదార్చిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూంకు వెళ్లి టీమిండియా సభ్యులను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

PM Modi
ODI World Cup 2023 Final : వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో ఫైనల్‌కు చేరిన టీమ్ఇండియా ఆఖరి మ్యాచ్‌లో ఓడిపోయిన విషయం తెలిసిందే. 12 ఏళ్ల తరువాత ప్రపంచకప్‌ను ముద్దాడే సువర్ణావకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. దీంతో కోట్లాది మంది భారతీయులకు నిరాశ తప్పలేదు. భారత జట్టు ఓడిపోయినప్పటికీ ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ఫైనల్ వరకు అద్వితీయ ఆటతీరును కనబరిచిన రోహిత్ సేనకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదిలాఉంటే ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూంకు వెళ్లి టీమిండియా సభ్యులను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నవంబర్ 19న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. ఓటమి తరువాత టీమిండియా డ్రెస్సింగ్ రూంకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ క్రీడాకారులను ఓదార్చారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. అనంతరం కోచ్ రాహుల్ ద్రవిడ్, రవీంద్ర జడేజాలను భుజంతట్టి అభినందించారు. అహ్మద్ షమీని దగ్గరకు తీసుకొని ప్రధాని ఓదార్చారు. ఆటగాళ్లతో మాట్లాడిన ప్రధాని.. టోర్నమెంట్ అంతటా వారి ప్రదర్శనను మెచ్చుకున్నారు. మోదీ వెంట కేంద్ర మంత్రి అమిత్ షాకూడా ఉన్నారు.
https://twitter.com/ANI/status/1726818000458903713?s=20