Mumbai : ముంబయి ట్రైడెంట్ హోటల్ నుంచి పొగలు .. ఆందోళనలో స్ధానికులు

ముంబయి ట్రైడెంట్ హోటల్ పై భాగం నుంచి పొగలు రావడం స్ధానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో అందరూ ఆందోళన చెందారు. అయితే అక్కడ ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Mumbai

Mumbai : ముంబయి ట్రైడెంట్ హోటల్ భవనం నుంచి పొగలు రావడం కలకలం రేపింది. భవనం పై భాగం నుంచి దట్టమైన పొగలు బయటకు రావడం చూసి స్ధానికులు ఆందోళన చెందారు. అయితే ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించడంతో అంతా ఊపిరి తీసుకున్నారు.

Unfriendliest Cities : ‘అన్ ఫ్రెండ్లీ’ నగరాలుగా ముంబయి, ఢిల్లీ.. తాజాగా తేల్చిన సర్వే

ముంబయి నారిమన్ పాయింట్‌లో ఉంది ట్రైడెంట్ హోటల్. ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఉదయం 7 గంటలకు హోటల్ పై భాగం నుంచి దట్టమైన పొగలు రావడం ఒక్కసారిగా కలకలం రేపింది. జనం ఆందోళన బయటకు వచ్చారు. హోటల్  నుంచి పొగలు వస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగిందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ముంబయి పోలీసులు స్పందించారు.  అగ్ని ప్రమాదం వార్తలను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. హోటల్ బాయిలర్ రూం నుంచి పొగలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిసి జనం ఊపిరి పీల్చుకున్నారు.

Mumbai Police : స్పైడర్ మ్యాన్ మూవీ క్లిప్ వాడిన ముంబయి పోలీసులు .. పైరేటెడ్ సినిమాలు డౌన్ లోడ్ చేయడం నేరం కాదా? అని ప్రశ్నిస్తున్న నెటిజన్లు

@hifrom_vinit అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ట్రైడెంట్ హోటల్ వీడియో వైరల్ అవుతోంది.