Unfriendliest Cities : ‘అన్ ఫ్రెండ్లీ’ నగరాలుగా ముంబయి, ఢిల్లీ.. తాజాగా తేల్చిన సర్వే

ఏదైనా సిటీకి కొత్తగా నివాసానికి వెళ్లాలంటే అక్కడి మనుష్యులు, వాతావరణం కూడా గమనించుకుంటాం. చక్కని స్నేహపూర్వక వాతావరణం ఉంటే వెంటనే అక్కడివారితో కలిసిపోవాలని అనుకుంటాం. అలాంటి సిటీల జాబితాను ప్రపంచ వ్యాప్తంగా ఓ సర్వే వెల్లడించింది. అయితే ఢిల్లీ, ముంబయి మాత్రం 'అన్ ఫ్రెండ్లీ' సిటీస్ అంటూ ఆ జాబితా స్పష్టం చేసింది.

Unfriendliest Cities : ‘అన్ ఫ్రెండ్లీ’ నగరాలుగా ముంబయి, ఢిల్లీ.. తాజాగా తేల్చిన సర్వే

Unfriendliest Cities

Updated On : June 13, 2023 / 6:23 PM IST

Unfriendliest Cities : ఢిల్లీ, ముంబయిలో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారా? ఈ రెండు సిటీల్లో స్నేహపూర్వక వాతావరణం కనిపించదట. రీసెంట్‌గా ఓ సర్వే చెబుతోంది.

Mumbai Police : స్పైడర్ మ్యాన్ మూవీ క్లిప్ వాడిన ముంబయి పోలీసులు .. పైరేటెడ్ సినిమాలు డౌన్ లోడ్ చేయడం నేరం కాదా? అని ప్రశ్నిస్తున్న నెటిజన్లు

చాలామంది స్నేహితులు కావాలనుకుంటున్నారా? చక్కని స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలని ఉందా? ఈ రెండు భారతీయ నగరాలకు దూరంగా ఉండాలని ఓ సర్వే చెబుతోంది. ఆన్ లైన్ ట్యూటరింగ్ మరియు లాంగ్వేజ్ లెసన్స్ ప్లాట్‌ఫారమ్ అయిన ప్రిప్లై ప్రపంచ వ్యాప్తంగా జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైందట. ఈ సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా 53 నగరాలు స్ధానికేతరుల పట్ల స్నేహభావంతో ఉంటాయని అంచనా వేశారట. ఇక భారతదేశానికి సంబంధించి ఏ నగరం ఈ స్నేహపూర్వక నగరాల జాబితాలో లేనప్పటికీ ఢిల్లీ, ముంబయి మాత్రం ‘అన్ ఫ్రెండ్లీ’ జాబితాలో చేరాయి.

Bicycle Stunt : రోడ్డుపై ఘోరంగా ఫెయిలైన సైకిల్ స్టంట్.. వీడియో షేర్ చేసిన ఢిల్లీ పోలీసులు

ఘనాలోని అక్రా అతి తక్కువ స్నేహ పూర్వక నగరంగా ర్యాంక్ పొందింది. మొరాకోలోని మర్రకేచ్ రెండవస్ధానంలో ముంబయి, కౌలాలంపూర్, రియో డిజెనీరో మరియు ఢిల్లీ అన్‌ఫ్రెండ్లీ జాబితాలో వరుస స్ధానాలు ఆక్రమించాయి. టొరెంటో, సిడ్నీ 2023లో స్ధానికేతరుల పట్ల స్నేహపూర్వకంగా మెలిగే నగరాలుగా గుర్తించబడ్డాయి. ఎడిన్ బర్గ్, మాంచెస్టర్‌లు వరుసగా రెండు..మూడు స్ధానాల్లో నిలిచాయి. సందర్శకుల రాకపోకలు, భద్రత, సమానత్వం, సంతోషం, భాష ద్వారా కమ్యూనికేషన్ సౌలభ్యం, స్నేహపూర్వకంగా ఉండే సిబ్బంది ఈ ఆరు కొలమానాల ద్వారా ఈ నగరాలను గుర్తించినట్లు తెలుస్తోంది.