Bicycle Stunt : రోడ్డుపై ఘోరంగా ఫెయిలైన సైకిల్ స్టంట్.. వీడియో షేర్ చేసిన ఢిల్లీ పోలీసులు
ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు సైబర్ క్రైమ్, రోడ్ సేఫ్టీపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా వారు షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Delhi Police
Bicycle Stunt – Viral Video : రోడ్ సేఫ్టీపై ఢిల్లీ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా సైకిల్ స్టంట్ చేస్తున్న ఓ వ్యక్తి వీడియోను షేర్ చేస్తూ ఓ మంచి సందేశాన్ని పంచుకున్నారు.
Car Stunt: కారుతో స్టంట్ కోసం ప్రయత్నించిన డ్రైవర్.. డివైడర్ దాటి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్
ఢిల్లీ పోలీసులు అనేక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్‌కి సంబంధించిన అంశాలు, రోడ్ సేఫ్టీపై అవగాహన కలిగిస్తూ పోస్టు చేస్తుంటారు. ఈ పోస్టుల ద్వారా ప్రజలు సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. అయితే తాజాగా ఢిల్లీ పోలీసులు delhi.police_official తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసిన మరో వీడియో వైరల్ అవుతోంది.
వీడియోలో ఓ వ్యక్తి సైకిల్ తొక్కుతూ ఉంటాడు. తన కాళ్లను సైకిల్ హ్యాండిల్‌పై బ్యాలెన్స్ చేస్తాడు. చేతులో గాల్లోకి చూపిస్తాడు. కొద్ది సెకండ్లలో సైకిల్ అదుపుతప్పి కింద పడిపోయాడు. ‘ఇలాంటి స్టంట్స్ దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. రోడ్డుపై సురక్షితంగా ఉండండి’ అనే క్యాప్షన్‌తో ఢిల్లీ పోలీసులు వీడియోను షేర్ చేశారు.
Car Stunt Death : ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కారుతో స్టంట్ చేయబోయి గుద్ది చంపేశాడు
‘ఏదైనా ఫీట్స్ చేసేటపుడు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి’ అని ఒకరు.. ‘ప్రజలకు అవగాహన కల్పించడంలో ఢిల్లీ పోలీసుల తర్వాతే ఎవరైనా’ అని మరొకరు.. కొందరు ఎమోజీలతో తమ స్పందన తెలియజేశారు. ప్రజలను చైతన్య పరచడంలో ఢిల్లీ పోలీసులు ముందున్నారని చాలామంది కితాబు ఇస్తున్నారు.
View this post on Instagram