Car Stunt Death : ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కారుతో స్టంట్ చేయబోయి గుద్ది చంపేశాడు

హర్యానాలో దారుణం జరిగింది. ఓ తాగుబోతు చేసిన పని ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. కారుతో స్టంట్ చేయబోయిన అతగాడు.. వేగాన్ని నియంత్రించలేక ఓ వ్యక్తిని గుద్ది చంపేశాడు.

Car Stunt Death : ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కారుతో స్టంట్ చేయబోయి గుద్ది చంపేశాడు

Car Stunt Death : హర్యానాలో దారుణం జరిగింది. ఓ తాగుబోతు చేసిన పని ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. కారుతో స్టంట్ చేయబోయిన అతగాడు.. వేగాన్ని నియంత్రించలేక ఓ వ్యక్తిని గుద్ది చంపేశాడు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఉంది.

గుర్ గావ్ లో ఈ ఘటన జరిగింది. అది తెల్లవారుజామున 2 గంటల సమయం. ఓ వ్యక్తి తాగిన మత్తులో ఉన్నాడు. కారుతో(మారుతి ఎర్టిగా) స్టంట్ చేయాలని అనుకున్నాడు. ఓ లిక్కర్ షాప్ ముందు స్టంట్ చేసేందుకు ప్రయత్నించాడు. చాలా వేగంగా వాహనాన్ని నడిపాడు. అయితే, నియంత్రణ కోల్పోయాడు. అదే వేగంతో వచ్చి రోడ్డు పక్కన ఓ షాపు ముందు నిల్చున్న కొందరు వ్యక్తులను కారుతో బలంగా ఢీకొట్టాడు. కారు వేగంగా తమ వైపు వస్తుండటాన్ని గమనించిన ఆ వ్యక్తులు పక్కకు జరిగే ప్రయత్నం చేశారు. ఇంతలోనూ ఊహించని ఘోరం జరిగిపోయింది. కారు వచ్చి ఢీకొట్టేసింది. ఈ ఘటనలో 50ఏళ్ల వృద్ధుడు స్పాట్ లోనే మరణించాడు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కారు వేగంగా వచ్చిన వ్యక్తులను ఢీకొన్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కారు వేగంగా వచ్చిన వ్యక్తులను ఢీకొన్న తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. వీడియో చూసినోళ్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఏడుగురిని అరెస్ట్ చేశారు. రెండు కార్లను సీజ్ చేశారు. నిందితుల్లో ఒకడు డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తాడని, మరో ముగ్గురు ట్రావెల్ ఏజెన్సీలో పని చేస్తారని పోలీసులు గుర్తించారు.

కారుతో తొలుత ఓ స్టంట్ చేశారని, రెండో స్టంట్ చేసే సమయంలో ఘోరం జరిగిందని పోలీసులు వెల్లడించారు. కారుతో ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టగా.. అందులో ఓ వృద్ధుడు చనిపోయాడన్నారు. ఈ ఘటనలో నిందితులందరినీ అరెస్ట్ చేసినట్లు తెలిపారు.