Peddi : హమ్మయ్య.. తెలంగాణలో పెద్ది టికెట్ రేట్లు పెంపు లేనట్టే.. ప్రీమియర్స్ అయినా ఉంటాయా..?
తెలంగాణలో మాత్రం టికెట్ రేట్ల పెంపు లేదనే తెలుస్తుంది. (Peddi)
Peddi
Peddi : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న రిలీజ్ కానుంది. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలకు, స్టార్ హీరో సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం సాధారణం అయిపొయింది. మూవీ యూనిట్స్ ప్రభుత్వాల దగ్గరకు వెళ్లి అడగడంతో టికెట్ రేట్లను పెంచుతున్నారు. ఇప్పటికే పెద్ది సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లను పెంచుతూ పర్మిషన్ ఇచ్చారు. అయితే తెలంగాణలో మాత్రం టికెట్ రేట్ల పెంపు లేదనే తెలుస్తుంది.
పుష్ప 2 ఘటన తర్వాత నుంచి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోలు ఇబ్బందిగా మారాయి. ఒకవేళ ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చినా కోర్టు అంగీకరించట్లేదు. దీంతో తెలంగాణలో ఈ టికెట్ రేట్ల పెంపు వ్యవహారం ఇటు సినీ పరిశ్రమకు, అటు ప్రభుత్వానికి ఓ తలనొప్పిగా మారింది.
Also Read : Allu Sirish : అల్లు శిరీష్ బర్త్ డే స్పెషల్.. చిన్నప్పటి ఫోటోలు చూశారా..? ఎంత బబ్లీగా ఉన్నాడో..
ఇప్పుడు పెద్ది సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచాలని, ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వాలని మూవీ యూనిట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు హోమ్ సెక్రటరీకి రెండు సార్లు వినతి పత్రాన్ని అందించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో మూవీ యూనిట్ కోర్టుని ఆశ్రయించింది. పెద్ది సినిమా టికెట్ రేట్లు పెంచాలని కోర్టులో పిటిషన్ వేశారు. టికెట్ ధరల పెంపు వ్యవహారంపై గతంలో ఇచ్చిన తీర్పులను దృష్టిలో పెట్టుకొని హైకోర్టు పెద్దిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా జూన్ 6 కి విచారణ వేశారు. సినిమా జూన్ 4 రిలీజ్ ఉండటంతో పెద్ది టీమ్ వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంది.
దీంతో తెలంగాణలో పెద్ది సినిమాకు టికెట్ ధరలు పెరిగే అవకాశం లేనట్టే. కచ్చితంగా ఇది సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుంది. మరి ప్రీమియర్ షోలు అయినా పర్మిషన్ ఇస్తారో లేదో చూడాలి. అది కూడా ఇవ్వకపోతే పెద్దికి తెలంగాణలో గట్టి ఎఫెక్ట్ పడటం ఖాయం.
