Longest Hair Record : పొడవాటి జుట్టుతో 15 ఏళ్ల బాలుడు ప్రపంచ రికార్డ్

పొడవాటి జుట్టుతో 15 ఏళ్ల బాలుడు ప్రపంచ రికార్డు సాధించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ రికార్డు గురించి యూట్యూబ్‌లో వీడియో షేర్ చేసింది. ఆ వీడియో వైరల్ అవుతోంది.

Guinness World Records

Longest Hair – Guinness World Records : 15 ఏళ్ల యూపీ టీనేజర్ అత్యంత పొడవాటి జుట్టును కలిగి ప్రపంచ రికార్డు సాధించాడు. ప్రస్తుతం అతని రికార్డుకి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

గ్రేటర్ నోయిడాకు చెందిన 15 ఏళ్ల యువకుడు సిదక్‌దీప్ సింగ్ చాహల్ అత్యంత పొడవాటి జుట్టు కలిగిన వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశాడు. గిన్నిస్ వరల్డ్ వరల్డ్ రికార్డ్స్ (GWR) యూట్యూబ్‌లో సిదక్‌దీప్ సింగ్ చాహల్ వీడియోను షేర్ చేసింది. క్లిప్‌లో చాహల్ చిన్నప్పుడు తన పొడవాటి జుట్టుతో ఎంత హ్యాపీగా ఉన్నాడో.. తరువాత వద్దని తల్లిదండ్రులను ఎలా రిక్వెస్ట్ చేసాడో వివరించాడు. సిక్కు మతాన్ని అనుసరించే చాహల్ తన మత విశ్వాసాలను గౌరవించడం కోసం ఎప్పుడూ జుట్టు కత్తిరించుకోలేదట.  ప్రస్తుతం అతని జుట్టు 146 సెంటిమీటర్ల (4 అడుగుల 9.5 అంగుళాలు) పొడవు పెరిగింది.

Akshay Kumar : సెల్ఫీలతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన అక్షయ్ కుమార్‌..

చాహల్ జుట్టును ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో వీడియోలో వివరించాడు. అందుకోసం తన తల్లి చేసే సాయాన్ని పంచుకున్నాడు. చాహల్ రికార్డు గురించి విన్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారట. ప్రస్తుతం బాలుర విభాగంలో చాహల్ పొడవాటి జుట్టుతో తన రికార్డును పదిలం చేసుకున్నాడు.

Elisabeath Guinness Record : 1600 లీటర్ల చనుబాలు దానం చేసిన అమ్మ, వేలాది చంటిబిడ్డల కడుపు నింపిన మాతృమూర్తికి దక్కిన గిన్నిస్ అవార్డ్