Traffic Police: బండి ఆపలేదని యువకుల్ని తోసేసి బైక్ పైనుంచి కింద పడేసిన కానిస్టేబుల్.. వీడియో వైరల్
ట్రాఫిక్ తనిఖీలు నిర్వహిస్తుండగా, తమ బండి ఆపకుండా వెళ్లారు ఇద్దరు యువకులు. దీంతో ఒక పోలీసు వారిని కర్రతో కొట్టాడు. మరో కానిస్టేబుల్ వారిపైకి దూకి, కిందికి తోసేశాడు. దీంతో ఇద్దరూ బైక్ పై నుంచి కిందపడిపోయారు.
- Narender Thiru
- Published On : October 14, 2022 / 05:12 PM IST
Traffic Police: వాహన తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు పోలీసులు విధి నిర్వహణలో ప్రవర్తించే తీరు కొన్నిసార్లు వాహనదారులు గాయాలపాలయ్యేలా చేస్తుంది. తాజాగా బిహార్‍లో అలాంటి ఘటనే జరిగింది. బిహార్, జముయ్ ప్రాంతంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Parathas: పరాటాలపై 18 శాతం జీఎస్టీ.. బ్రిటీష్ వాళ్లు కూడా పన్ను వేయలేదన్న కేజ్రీవాల్
ఈ సందర్భంగా స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకులు తమ బండి ఆపకుండా ముందుకు వెళ్లారు. దీంతో కోపం తెచ్చుకున్న ఒక కానిస్టేబుల్ వారిని తన దగ్గరున్న కర్రతో కొట్టాడు. అనంతరం మరో కానిస్టేబుల్ వారిని వెండించి, తోసేశాడు. ఈ క్రమంలో వాహనంపై ఉన్న ఇద్దరూ కిందపడిపోయారు. వారికి గాయాలయ్యాయి. కానిస్టేబుల్ కూడా వారిపై పడ్డాడు. అయితే, కానిస్టేబుల్‌కు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. కింద పడ్డ వాహనదారులపైకి పోలీసులు తిరిగి దాడి చేయబోయారు.
దీంతో వారు చేతులెత్తి తమను రక్షించమని వేడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం అక్కడ ఉన్న వాళ్లలో ఎవరో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
हेलमेट नहीं पहना..पुलिस ने चलती स्कूटी से धक्का दिया।
– वायरल वीडियो बिहार के जमुई का है। जहां गाड़ी के पीछे दौड़ा एक कॉन्स्टेबल और दूसरे ने नीचे गिरा दिया।
– जब कॉन्स्टेबल को ये एहसास होता है कि कोई उसका वीडियो बना रहा है। तो वो सीधे वहां से निकल जाता है। pic.twitter.com/ZpGNj1gHR2— Shubhankar Mishra (@shubhankrmishra) October 14, 2022
