Munugodu: ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం.. 100కు పైగా అభ్యర్థులు.. ప్రధాన పార్టీల అభ్యర్థులు వీళ్లే

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నానికి నామినేషన్ల పర్వం పూర్తైంది. దాదాపు 140 నామినేషన్లు దాఖలుకాగా, వంద మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు.

Munugodu: ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం.. 100కు పైగా అభ్యర్థులు.. ప్రధాన పార్టీల అభ్యర్థులు వీళ్లే

Munugodu: మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల పర్వం శుక్రవారం మధ్యాహ్నంతో ముగిసింది. దాదాపు 140 వరకు నామినేషన్లు దాఖలుకాగా, 100 మందికిపైగా అభ్యర్థులు నామినేషన్ వేశారు. చివరిరోజైన శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.

Parathas: పరాటాలపై 18 శాతం జీఎస్టీ.. బ్రిటీష్ వాళ్లు కూడా పన్ను వేయలేదన్న కేజ్రీవాల్

శని, ఆదివారాల్లో నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు గడువు ఉంటుంది. నవంబర్ 3న పోలింగ్ నిర్వహిస్తారు. 6న కౌంటింగ్ జరిపి ఫలితం వెల్లడిస్తారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె చుండూరులో నామినేషన్ వేశారు. టీఆర్ఎస్ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయగా, టీజేఎస్ తరఫున పల్లె వినయ్ కుమార్ నామినేషన్ వేశారు.

Mega154: డబ్బింగ్ పనులు మొదలుపెట్టిన మెగా 154!

మరోవైపు చర్లగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. సుమారు 50 మంది భూ నిర్వాసితులు నామినేషన్ వేసినట్లు సమాచారం. నామినేషన్లు పరిశీలన, ఉపసంహరణ పూర్తైన తర్వాత పోటీలో ఎంత మంది అభ్యర్థులు ఉంటారనే విషయంలో స్పష్టత వస్తుంది.