ఫేస్ బుక్‌లో పరిచయం అయ్యారు. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఈ స్నేహం కాస్తా..ప్రేమగా మారిపోయింది. ఎప్పుడు ఛాటింగ్‌లో నిమగ్నమైన ఈ జంటకు అమ్మాయి తరపు వారు బలవంతంగా పెళ్లి చేశారు. తన లవర్‌ని చూద్దామని వచ్చి..బుక్ అయ్యాడు ప్రేమికుడు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది.
బాలేశ్వర్ జిల్లా మణిపూర్ సోరోలోని గులునియా గ్రామానికి చెందిన సురేంద్ర బెహెరా కుమార్తె, కుబబపాట్న గ్రామానికి చెందిన బై కుంటకు ఫేస్ బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఛాటింగ్‌లోనే ప్రేమాయణం నడిపాడు. అనంతరం ఇరువురు ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నారు. కొద్దిరోజులుగా కలవాలని అనుకున్నారు వీరిద్దరూ. అయితే ఇంట్లో కుటుంబసభ్యులు ఉండడం..ఇతరత్రా కారణాలతో అది వీలు కాలేదు.
సెప్టెంబర్ 12వ తేదీ గురువారం ఇంట్లో ఎవరూ లేరని అమ్మాయి..ప్రియుడికి చెప్పింది. తన ప్రియురాలితో ఏకాంతంగా గడిచే సమయం వచ్చే సరికి ఫుల్ ఖుష్ అయిపోయాడు. వెంటనే రెడీ అయిపోయాడు. అమ్మాయి ఇంట్లోకి వెళ్లాడు. ఇది చుట్టుపక్కల వారు చూశారు. వెంటనే అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పారు. ప్రేమ మాటల్లో నిమగ్నమైన వీరిని రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. ప్రేమ నిజమా అని నిలదీశారు. నిజమే అని చెప్పారు వారిద్దరూ. వెంటనే పెళ్లి చేసుకోవాలని గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆదేశించారు. ఇంటికి వచ్చిన అబ్బాయిని అల్లుడిని చేసుకున్నారు. వారి సంప్రదాయం ప్రకారం వివాహం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.