Varada vinayak : వరద వినాయకుడి దేవాలయంలో 130 ఏళ్లుగా వెలుగుతున్న అఖండద్వీపం..

వరద వినాయకుడు..భక్తుల ఈతిబాధలు తీర్చే బొజ్జగణపయ్య దేవాలయంలో దాదాపు 130 ఏళ్లుగా వెలుగుతున్న అఖండ దీపం ఓ ప్రత్యేక ఆకర్షణ. ఆ దీపాన్ని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తులు..

Ashtavinayak Yatra Varada vinayak :గణపతి, వినాయకుడు,గణపయ్య, లంబోదరుడు,విఘ్నేశ్వరుడు, ఏకదంతుడు ఇలా పార్వతీ తనయుడికి ఆయనకు మొత్తం 32 భిన్నమైన పేర్లు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఏ పేరుతో పూజించినా సర్వ విఘ్నాలు తొలగించి శుభాలు కలిగించటంలో గణపయ్యే ప్రథమదేవుడిగా పూజందుకుంటున్నాడు. గణపయ్యను పూజించాలంటే మనస్సునిండా భక్తి ఉంటే చాలు. భక్తితో పత్రాలతో పూజిస్తే చాలు ప్రసన్నమైపోయి కోరిన కోరికలు తీరుస్తాడు బొజ్జగణపయ్య. ఏ పూజ అయినా..ఏ శుభకార్యమైన విఘ్నాలు తొలగించాలని తొలిపూజ గణపతినే పూజిస్తారు. ఆ తరువాతే ఏ పూజ అయినా..అటువంటి గణపయ్య గుడి లేని ప్రాంతమే ఉండదు. మరి ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా మహారాష్ట్రలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్న ‘వరద వినాయకుడు’ గురించి తెలుసుకుందాం..

తెలుగు వారు శివరాత్రికి పంచారామాలు దర్శించుకున్నట్లుగా మహారాష్ట్రలో హిందువులు అష్టవినాయక యాత్రను చేస్తారు. అష్టవినాయక క్షేత్రాలను ఒక వరుసలో దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మొత్తం అష్టవినాయక క్షేత్రాలను దర్శించుకోవాలంటే 654 కి.మీ ప్రయాణించాలి. ఈ అష్టవినాయక క్షేత్రాల్లో ఒకటి వరద వినాకుడి దేవాలయం.పూణే నుండి 146 కి.మీ దూరంలో ఉన్న క్షేత్రం మహడ్‌ గ్రామం. ఇక్కడ స్వామి వరద వినాయకుడుగా భక్తులతో పూజలను అందుకుంటున్నారు. ఇక్కడ గణేశుడు విగ్రహం తూర్పు ముఖంగా ఉండటం విశేషం. గణపయ్య తొండం ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది. దేవాలయానికి ఆనుకుని ఉన్న సరస్సులో గణేశుడు విగ్రహం బయల్పడినట్లు స్థలపురాణం చెబుతోంది. స్వయంభువుగా వెలిసి వరద వినాయకుడిగా సుప్రసిద్ధుడయ్యాడట. ఈ స్వామివారి గర్భగుడిలోని దీపం (నందదీప్)100 వెలుగుతూనే ఉందని స్థానికులు చెబుతారు.

ఈ వరద వినాయకుడు దేవాయలం వెనుక ఉన్న చరిత్ర ఏమిటంటే..ఈ ప్రాంతాన్ని పాలించే రుక్మాంగదుడు అనే మహారాజు వాచక్నవి అనే రుషిని దర్శించుకోవటానికి వచ్చాడట. రాజు వైభోగాన్ని కళ్లారా చూసిన రుషి భార్య ముకుంద అతనిపై మనసు పడిందట. తన మనసులోని మాటను రాజుతో చెప్పింది ముకుంద. దానికి రాజు అంగీకరించలేదు.కానీ మాయలమారి ఇంద్రుడు మాత్రం రాజు రుక్మాంగదుడి రూపంలో వచ్చాడు. వద్దని వెళ్లిపోయిన రాజు తిరిగి వచ్చేసరికి ముకుంద పరవశించిపోయింది. అలా రుక్మాంగదుడు అని భావించి ఇంద్రుడితో ఆరోజు రాత్రి గడిపింది. వారి కలయికకు ఫలితంగా గృత్సమధుడు అనే మగపిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడు పెద్ద అయ్యాక తన పుట్టుక రహస్యాన్ని తెలుసుకున్నాడు. అలా తన తల్లి చేసిన పాపంతో పాటు అందరి పాపాలు పోవాలని వినాయకుడిని ప్రార్థించగా పిల్లవాడి భక్తికి మెచ్చిన లంబోదరుడు ప్రత్యక్షమయ్యాడు.

ఏం కావాలో కోరుకోమన్నాడట. దానికి గృత్సమధుడు స్వామీ నాకు ఏమీ అక్కరలేదు. నువ్వు ఇక్కడే స్వయంభూవుగా వెలవాలి. నిన్ను దర్శించే భక్తుల పాపాలు తొలగించాలని అని కోరాడట. అలా గణపయ్య అక్యడే స్వయంభూవుగా వెలసి భక్తుల పూజలు అందుకుంటున్నాడు.భక్తులు పాపాలు తొలగిస్తున్నాడట. ఈస్వామి దేవాయల గర్భగుడిలో దీపం గత 1892 ఏళ్లనుంచి వెలుగుతోందని స్థానికులు చెబుతారు. అంటే 100 ఏళ్లకుపైగా దాదాపు 130 ఏళ్లుగా ఈ అఖండ దీపంలో వెలుగుతునే ఉందన్నమాట..ఈ వరద వినాయకుడు భక్తుల ఈతిబాధలు తీర్చే బొజ్జగణపయ్య దేవాలయంలో దాదాపు 130 ఏళ్లుగా వెలుగుతున్న ఈ అఖండ దీపం ఓ ప్రత్యేక ఆకర్షణ. ఆ దీపాన్ని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.

ట్రెండింగ్ వార్తలు