Viral Video: కారులో 6 అడుగుల కొండచిలువ.. దాన్ని చూసి వణికిపోయి..

అక్కడకు చేరుకున్న సిబ్బందికి.. పామును పట్టుకోవడానికి దాదాపు 30 నిమిషాలు పట్టింది.

Python

Python: పామును దూరం నుంచి చూస్తేనే భయపడి పోతాం. ఇక అది మనం రోజూ తిరుగుతున్న కారులో ఉంటే? అది కారులోనే ఒక్కసారిగా కనపడితే? దక్షిణ ఢిల్లీలోని ఓ వ్యక్తికి ఇటువంటి ఘటనే ఎదురైంది.

చిత్తరంజన్ పార్క్ వద్ద ఓ వ్యక్తికి తన కారు ఇంజన్‌లో ఆరు అడుగుల పాము కనపడింది. దాన్ని చూసి ఆ వ్యక్తి వణికిపోయాడు. వెంటనే అతడు సంబంధిత ఎన్జీవో సంస్థకి సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న సిబ్బంది పామును పట్టుకోవడానికి దాదాపు 30 నిమిషాలు పట్టింది.

ఇందుకు సంబంధించిన వీడియోను వైల్డ్‌లైఫ్ ఎస్‌వోఎస్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇంజన్ కు కొండచిలువ చుట్టుకుని ఉండడంతో దాన్నీ సురక్షితంగా బయటకు తీయడానికి చాలా సమయం పట్టిందని ఎన్జీవో సిబ్బంది వివరించారు.

దాన్ని చివరకు అటవీశాఖ సిబ్బందికి అప్పగించామని తెలిపారు. అనంతరం దాన్ని అడవీలో విడిచిపెట్టారని వివరించారు. పాములు కనపడితే వాటిని చంపొద్దని, సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఎన్జీవో సిబ్బంది సూచిస్తున్నారు.