Viral Video: క్రికెట్ ఆడుతూ సిక్స్ కొట్టి.. అక్కడికక్కడే కుప్పకూలి మృతి

తోటి ఆటగాళ్లు అతడిని వెంటనే లేపే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలు..

క్రికెట్ ఆడుతూ బ్యాటింగ్ చేస్తున్న ఓ యువకుడు సిక్స్ కొట్టి ఆ వెంటనే మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలోని మీరారోడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. తమతో పాటు అప్పటివరకు క్రికెట్ ఆడుతూ అతడు మృతి చెందిన ఘటన అక్కడి వారిని షాక్ కు గురిచేసింది.

ఈ వీడియోలో పింక్ జెర్సీలో ఉన్న యువకుడు బౌలర్ బంతి వేయగానే షాట్‌ను కొట్టినట్లు కనపడుతోంది. ఆ తర్వాతి బంతిని ఆడడానికి అతడు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయాడు.

తోటి ఆటగాళ్లు అతడిని వెంటనే లేపే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల గుండె పోటు మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి.

జిమ్‌లో అతిగా వ్యాయామం చేస్తూ, ఆడుకుంటున్న సమయంలో, ఆఫీసులో కూర్చున్న సమయంలో పలువురు వ్యక్తులు అక్కడికక్కడే కుప్పుకూలిపోయి మృతి చెందిన ఘటనలు ఇటీవల భారీగా వైరల్ అయ్యాయి. ప్రతిరోజు తేలికపాటి వ్యాయామం చేస్తూ సాత్విక ఆహారం తింటే ఇటువంటి ముప్పు నుంచి దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read: వామ్మో.. వాటర్ ట్యాంక్‌లో శవం, 10రోజులుగా ఆ నీళ్లనే తాగుతున్న జనం..! నల్గొండలో ఘోరం