Viral Video: పెళ్లి వేడుకలోకి దూసుకువచ్చిన కోతులు.. వాటి చేష్టలకు నవ్వుల్.. నవ్వుల్..
ఒకరు ఓ ప్లేటులో పట్టుకున్న కొన్ని పండ్లను ఓ కోతి తీసుకుని పరుగులు తీసింది.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. వివాహంలో బంధువుల హడావుడి అంతా ఇంతా ఉండదు. బంధువుల హడావుడి ఉంటే బాగానే ఉంటుంది కానీ, కోతుల హడావుడి ఉంటే ఎలా ఉంటుంది. కోతులు చేసే విధ్వంసాన్ని అసలు తట్టుకోగలమా? ఓ పెళ్లిలో ఓ కోతి చేసిన హడావుడి చూస్తే నవ్వకుండా ఉండలేరు.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ వివాహ వేడుకలో అతిథులు పెళ్లికొడుకు, పెళ్లికూతురికి సంప్రదాయపరంగా తంతు జరుపుతుండగా కొన్ని కోతులు దూసుకువచ్చాయి.
వాటిని చూసి పెళ్లికి వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు. ఒకరు ఓ ప్లేటులో పట్టుకున్న కొన్ని పండ్లను ఓ కోతి తీసుకుని పరుగులు తీసింది. దీంతో పెళ్లిలోని వారంతా నవ్వుకున్నారు.
Also Read: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్… మేస్త్రీలకు సర్కార్ ట్రైనింగ్..
ప్లేటులో పట్టుకున్న కొన్ని పండ్లను ఓ కోతి తీసుకుని పరుగులు తీసింది. దీంతో పెళ్లిలోని వారంతా నవ్వుకున్నారు. ఆ కోతి పండ్లను తీసుకువెళ్లగా దాని వద్ద నుంచి వాటిని తీసుకోవడానికి మరికొన్ని కోతులు వచ్చాయి.
పెళ్లిలో ఆ కోతుల చేష్టలు చూస్తున్నవారు వాటిని అక్కడకు ఎందుకు రానించారని ప్రశ్నిస్తున్నారు. పెళ్లి వేడుకలు కోతులు ఉండే ప్రదేశం వద్ద పెట్టుకున్నారా? లేదా పెళ్లి వేడుకకే కోతులు వచ్చాయా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Bro Saw the opportunity and Took it😂 pic.twitter.com/FGMTQwgSrX
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 25, 2025