Viral Video: మెట్రో రైలులో సైకిల్‌ను తీసుకెళ్లిన యువకుడు

హర్షిత్ అనురాగ్ అనే యువకుడు మెట్రో స్టేషన్‌కు వెళ్లి తన కోసం టికెట్ కొనుక్కున్నాడు. అనంతరం సైకిల్‌ను పట్టుకుని ఎస్కలేటర్ ఎక్కాడు.

bicycle on Mumbai Metro

Bicycle on Mumbai Metro: సైకిల్‌‌ను సామాన్యుడి వాహనమని అంటారు. సైకిల్‌పైనే ప్రయాణం కొనసాగిస్తూ అనేక పనులు పూర్తి చేస్తుంటారు చాలామంది. ఇటువంటి అవసరాల కోసమే కాకుండా సైకిల్‌‌ను ఆరోగ్య ప్రదాయినిగా వైద్యులు చెబుతుంటారు. సైకిళ్లను మనం రోడ్లపై, వీధుల్లో, పొలాల వద్ద చూస్తుంటాం.

దాన్ని ఎప్పుడైనా మెట్రో ట్రైనులో చూశారా? ఇటువంటి దృశ్యమే తాజాగా ముంబై మెట్రో ట్రైనులో కనపడింది. ఓ యువకుడు తన సైకిల్ ను మెట్రో ట్రైనులో తీసుకెళ్లి, వీడియో తీసుకున్నాడు. హర్షిత్ అనురాగ్ అనే యువకుడు మెట్రో స్టేషన్‌కు వెళ్లి తన కోసం టికెట్ కొనుక్కున్నాడు. అనంతరం సైకిల్‌ను పట్టుకుని ఎస్కలేటర్ ఎక్కాడు.

ప్లాట్ ఫాంపై నిలబడి ట్రైను కోసం వేచిచూసి కాస్త ఖాళీగా వచ్చిన ట్రైను ఎక్కాడు. సైకిల్ వంటి వాటి కోసం ట్రైనులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాండ్‌లో దాన్ని ఉంచాడు. దాని పక్కనే సీట్లో కూర్చుని ప్రయాణించాడు. తాను దిగాల్సిన స్టేషన్ రాగానే మళ్లీ సైకిల్‌ను తీసుకుని కిందకు దిగాడు.

సందడిగా ఉండే ముంబై వీధుల్లో సైకిల్ తొక్కడం, ఇక్కడి మెట్రోలో ప్రయాణించడం ఓ గొప్ప అనుభవమని హర్షిత్ అనురాగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంటూ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. నగరాన్ని హాయిగా చూడడానికి, మన ఫిట్‌నెస్‌ను కొనసాగించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పాడు.

Vemana Indlu : ఆ గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకోరు.. అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళ్లరు.. ఇంకా విడ్డూరం ఏంటంటే?