Viral Video: టికెట్ లేకుండా వందే భారత్ ఎక్కిన పోలీసు.. పట్టేసిన టీటీఈ.. ఆ తర్వాత అసలు మజా షురూ..

రాజ్ బి.సింగ్ అనే ఓ జర్నలిస్టు ఈ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశాడు. భారతీయ రైల్వేను ట్యాగ్ చేస్తూ..

Viral Video

Vande Bharat: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలోని సమాచారం నిజమేనా అనే విషయంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు.

రాజ్ బి.సింగ్ అనే ఓ జర్నలిస్టు ఈ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశాడు. భారతీయ రైల్వేను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశాడు. ఆ వీడియో ఉన్న వివరాల ప్రకారం.. టికెట్ తీసుకోకుండా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి ఎంచక్కా కూర్చున్నారు యూపీకి చెందిన ఓ ఇన్‌స్పెక్టర్. ఆయన కూర్చున్న పక్కన సీట్లో లగేజ్ కూడా పెట్టారు.

ప్రయాణికులందరి వద్దా టికెట్ తనిఖీ చేస్తూ టీటీఈ వచ్చారు. ఈ ఇన్‌స్పెక్టర్‌ను కూడా టికెట్ చూపించాలని అడిగారు. అయితే తాను పోలీసునని, టికెట్ అవసరం లేదని ఆ ఇన్‌స్పెక్టర్ చెప్పినట్లు ఈ వీడియోలో ఉంది. టికెట్ లేకుండా రైలు ఎక్కడానికి వీల్లేదని టీటీఈ చెప్పారు.

దీంతో తనకు ఈ ఒక్కసారి టికెట్ లేకుండా ప్రయాణం చేసే ఛాన్స్ ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్ కోరినట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ ఇన్‌స్పెక్టర్‌ను తదుపరి స్టేషన్ లో టీటీఈ దించేసినట్లు సమాచారం. ఆ వందే భారత్ రైలు లఖ్‌నవూ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది.

Delhi Metro : మెట్రోలో బరితెగించిన జంట..వాళ్లు చేసిన పనికి మండిపడుతున్న నెటిజన్లు