Viral Video: గుడిలో మహిళను కిందపడేసి కొట్టి, జుట్టు పట్టుకుని బయటకు లాక్కెళ్లిన వైనం

బెంగళూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి గుడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను కింద పడేసి కొట్టి, జుట్టు పట్టుకుని బయటకు లాక్కెళ్లారు గుడి సిబ్బంది. ఆ తర్వాత కూడా కర్రతో ఆమెను కొట్టేందుకు ఓ వ్యక్తి మందిర ప్రాంగణంలోనే వెంటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది.

Viral Video

Viral Video: బెంగళూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి గుడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను కింద పడేసి కొట్టి, జుట్టు పట్టుకుని బయటకు లాక్కెళ్లారు గుడి సిబ్బంది. ఆ తర్వాత కూడా కర్రతో ఆమెను కొట్టేందుకు ఓ వ్యక్తి మందిర ప్రాంగణంలోనే వెంటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది.

బాధిత మహిళ పేరు హేమవతి అని తెలిసింది. ఇటీవల తాను అమృతహళ్లి ప్రాంతంలో గుడికి వెళ్లానని, ఆ సమయంలో తనపై గుడి సిబ్బంది దాడి చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలయానికి చెందిన ముని కృష్ణ అనే వ్యక్తిపై ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె దళిత సామాజిక వర్గానికి చెందినదని అందుకే దాడి జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారు.

అయితే, ఆ మహిళ గుడికి వచ్చి వేంకటేశ్వర స్వామి తన భర్త అంటూ పుజారితో వాదించిందని, స్వామి వారి విగ్రహం పక్కన కూర్చునేందుకు ప్రయత్నించిందని ఆలయానికి చెందిన ముని కృష్ణ పోలీసులకు తెలిపారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆమెను కోరగా, ఆమె పూజారిపై ఉమ్మి ఉంచిందని చెప్పారు. ఆ మహిళ ఎంతకీ వినకపోవడంతో బయటకు ఈడ్చుకెళ్లామని అన్నారు.

TN Governor: తమిళనాడు పేరు మార్చాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గవర్నర్.. నిప్పులు కురిపిస్తున్న తమిళులు