Viral Video: మెట్రో రైలులో కిర్రాక్ డ్యాన్స్ చేసిన అమ్మాయి

ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

రీల్స్ కోసం, సామాజిక మాధ్యమాల్లో ఫేమస్‌ కావడం కోసం యువత వేసే పిచ్చి వేషాలు అన్నీ ఇన్నీ కాదు. తమ వీడియోకు ఎన్ని లైకులు వస్తే అంత గొప్పగా ఫీల్ అవుతారు. తమ రీల్స్‌కు ఎంత రీచ్ వస్తే అంత ఘనతను సాధించామని అనుకుంటారు.

చాలా మంది అమ్మాయిలు ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేస్తూ వీడియో తీసుకుంటూ వారి చుట్టూ ఉన్నవారికి ఇబ్బంది కలిగిస్తుంటారు. తాజాగా, ఓ అమ్మాయి ఇటువంటి పనులనే చేసి వీడియో తీసుకుని, ఇన్‌స్టాలో పోస్ట్ చేసి నెటిజన్లతో తిట్టించుకుంటోంది.

మెట్రో కోచ్‌లో స్ట్రీ 2 సినిమా పాట ఆజ్ కీ రాత్‌కు డ్యాన్స్ చేసింది ఆ అమ్మాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ సహేలీ రుద్ర పోస్ట్ చేసింది.

మెట్రో ట్రైన్లలో ఇటువంటి పనులు చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నా చాలా మంది పట్టించుకోవడం లేదు. ఆ రూల్స్ అన్నీ తమకేమీ వర్తించబోవన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి వారిని జైల్లో వేస్తేనే ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉంటాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆహారంలో బొద్దింక.. ఫుడ్‌ పాయిజనింగ్‌.. వీడియో పోస్ట్ చేసిన కస్టమర్