Tarrif Hike : సామాన్యులపై మరో భారం.. మొబైల్ రీఛార్జ్ ధరలు భారీగా పెంపు..

ఇప్పటికే ఎయిర్ టెల్ కంపెనీ మొబైల్ రీచార్జ్ టారిఫ్ ధరలను భారీగా పెంచింది. ఇప్పుడు మరొక టెలికం కంపెనీ కూడా ఎయిర్ టెల్ బాటలోనే పయనించింది. రీచార్జ్ టారిఫ్ ధరలు భారీగా..

Tarrif Hike : ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ దగ్గరి నుంచి టమోటాల వరకు ధరల పెరుగుదలతో సామాన్యులు సతమతం అవుతున్నారు. ధరల పోటుతో విలవిలలాడిపోతున్నారు. ఏం కొనేదట్లు లేదు, ఏం తినేదట్లు లేదని వాపోతున్నారు. బతికేది ఎలాగో తెలియక బెంగపెట్టుకున్నారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు టెలికం కంపెనీలు కూడా ధరల మోతకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఎయిర్ టెల్ కంపెనీ మొబైల్ రీచార్జ్ టారిఫ్ ధరలను భారీగా పెంచింది. ఇప్పుడు మరొక టెలికం కంపెనీ వొడాఫోన్-ఐడియా కూడా ఎయిర్ టెల్ బాటలోనే పయనించింది. రీచార్జ్ టారిఫ్ ధరలు భారీగా పెంచేసింది. మొబైల్ రీచార్జ్ ధరల పెంపుతో సామాన్యులపై మరింత ప్రభావం పడింది.

Computer Work : గంటల కొద్దీ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లతో గడిపేవారికి వచ్చే వ్యాధులు ఇవే

మొబైల్ కాల్, డేటా టారిఫ్ ధరలను పెంచుతున్నట్లు వొడాఫోన్-ఐడియా ప్రకటించింది. ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలను 20-25 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 25 నుంచే ధరల పెంపు అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. దీంతో వొడాఫోన్ ఐడియా కస్టమర్లపై ప్రభావం పడనుంది.

ఏఆర్‌పీయూ మెరుగుదల కోసం ఈ టారిఫ్ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని వొడాఫోన్ ఐడియా తెలిపింది. కాగా నిన్ననే (నవంబర్ 22) ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్(మొబైల్ కాల్, డేటా) ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థ కూడా 25 శాతం వరకు ధరలను పెంచింది. నవంబర్ 26 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుంది.

ఈ కొత్త టారిఫ్ ప్లాన్లు ‘భారత్ లో వేగవంతమైన మొబైల్ నెట్‌వర్క్ సేవలను అందించడం’ కోసం సహాయపడతాయని వొడాఫోన్ తెలిపింది. ప్రారంభ స్థాయి ప్లాన్‌ల ధరలను 25శాతం పెంచగా.. లిమిటెడ్‌ కేటగిరీ ప్లాన్‌ల ధరలను 20-23శాతం పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో వినియోగదారుపై సగటు ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. భారతి ఎయిర్‌టెల్ టారిఫ్ ధరల ప్రకటించిన ఒక రోజు తరువాత వొడాఫోన్ ఐడియా ఈ ప్రకటన చేసింది.

Water : అధిక మోతాదులో నీరు తాగుతున్నారా!..అయితే జాగ్రత్త?…

ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు పెరిగిన టారిఫ్ ధరలతో బెంబేలెత్తిపోతున్నారు. పెరిగిన ధరలు చూసి షాక్ అవుతున్నారు. రూ.99 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న ప్లాన్ల ధరలు పెరిగాయి. ఇంతకుముందు రూ.219తో రీచార్జ్ చేస్తే 28 రోజుల అన్ లిమిటెడ్ కాలింగ్, రోజూ 1 జీబీ డేటా వచ్చేది. ఇప్పుడా ప్లాన్ రూ.265కు పెరిగింది. 56 రోజుల రూ.449 ప్లాన్ రూ.549కి పెరిగింది. అంటే ఏకంగా రూ.100 పెంచారన్నమాట.

ఎయిర్ టెల్.. టారిఫ్ ధరల పెంపు తర్వాత…

 

వొడాఫోన్-ఐడియా.. టారిఫ్ ధరల పెంపు తర్వాత…..

ట్రెండింగ్ వార్తలు