ఈసీ పట్టిష్ట ఏర్పాట్లు : ఛత్తీస్ గఢ్ లో పోటెత్తిన ఓటర్లు 

  • Publish Date - April 11, 2019 / 04:52 AM IST

ఛత్తీస్‌గఢ్‌ : నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో మావోయిస్టులకు ఏమాత్రం భయపడకుండా ఓట్లు వేసేందుకు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు ఓటర్లు. దంతెవాడ అంటేనేమావోల కంచుకోట..ఇక్కడ కూడా ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. అంతేకాదు నక్సల్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజలు ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య దంతేవాడ, సుక్మా ప్రాంతాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. 

మంగళ వారం (ఏప్రిల్ 4)మావోయిస్టులు పేల్చిన మందుపాతర పేలుడులో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి, ఆయన ముగ్గురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు.నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్లు, ఎస్పీలు పోలింగ్ సమయం పూర్తయ్యేంత వరకూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఈసీ ఆదేశించింది. 

 

ట్రెండింగ్ వార్తలు