వాళ్లే సినీ పరిశ్రమను అంతం చేయాలనుకుంటున్నారు – రేసు గుర్రం విలన్

  • Publish Date - September 15, 2020 / 12:31 PM IST

BJP MP Ravi Kishan : బాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపనలు నేతలు, నటుల మధ్య చిచ్చు రేపుతున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ రవి కిషన్ చేసిన వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. కొందరి కోసం అందర్నీ విమర్శించడం తగదని రాజ్యసభలో వెల్లడించారు. జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రవి కిషన్ స్పందించారు.



https://10tv.in/bjp-in-odisha-very-soon-claims-party-chief-jp-nadda/
తాను చేసిన వ్యాఖ్యలను సమర్దిస్తారని అనుకున్నానని తెలిపారు. పరిశ్రమలో అందరూ డ్రగ్స్ ఉపయోగించడం లేదని స్ఫష్టం చేశారాయన. అయితే..డ్రగ్స్ వినియోగించే వారు..బాలీవుడ్ సినీ పరిశ్రమను అంతం చేయాలనే ప్రణాళికతో ఉన్నారని వెల్లడించారు.



తాను, జయాబచ్చన్ పరిశ్రమలోకి వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావని, బాలీవుడ్ పరిశ్రమను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ రవి కిషన్.

జయాబచ్చన్ ఏమన్నారు ?

రాజ్యసభలో జయాబచ్చన్ మాట్లాడారు. లోక్ సభలో పరిశ్రమకు చెందిన వ్యక్తే..ఈ ఆరోపణలు చేయడంతో తాను ఎంతో సిగ్గు పడ్డానని, ఆయన వ్యాఖ్యలు చూస్తే..అన్నం పెట్టిన చేతినే నురుక్కున్నట్లుగా ఉందన్నారు. కొందరి కోసం అందరిని విమర్శించడం తగదన్నారు.




రవి కిషన్ ఏమన్నారు ?

బాలీవుడ్‌లో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్‌ అన్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ యువతను నాశనం చేయటానికి కుట్ర జరుగుతోందని, పొరుగుదేశాలు ఇందుకు సహకారం అందిస్తున్నాయన్నారు. పాకిస్తాన్‌, చైనాలనుంచి ప్రతి ఏటా మత్తు పదార్థాలు దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయని, నేపాల్‌, పంజాబ్‌ ద్వారా దేశంలోకి వస్తున్నాయని రవి కిషన్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.