Alert Messages: మొబైల్‌ యూజర్లను భయపెడుతున్న వార్నింగ్‌ మెస్సేజ్‌లు.. కేంద్రం ఏం చెప్పిందంటే?

దేశ వ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌ల యూజర్లకు ఈ అలర్ట్ మెస్సేజ్‌లు వస్తున్నాయి. ఈ అలర్ట్ పై కేంద్రం వివరణ ఇస్తూ..

Alert Message For Users,

Mobile Massage : జేబులో ఉండే మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పెద్దశబ్దంతో అలారమ్ సౌండ్ వస్తుండటంతో యూజర్లు బెంబేలెత్తిపోతున్నారు. పేలుతుందేమోనన్న భయంతో జేబులో నుంచి ఫోన్ తీసి చూడగా.. స్క్రీన్‌పై మెస్సేజ్ కనిపిస్తుంది. దానిపై ఒకే కొట్టే వరకు ఫోన్ నుంచి భారీ శబ్దంతో అలారమ్ సౌండ్, వైబ్రేషన్ వస్తూనే ఉంది. దాదాపు అందరి మొబైల్ యూజర్లకు ఇలాంటి అలర్ట్ మెస్సేజ్‌లు వస్తుండటంతో ఏం జరుగుతుందోనన్న భయం నెలకొంది. సాధారణంగా విదేశాల్లో భూకంపాలు, తుఫాన్ల సమయంలో ఇలాంటి అలర్ట్ లు వస్తుంటాయి. అయితే, మన దేశంలో ఇలాంటి మెసెజ్‌లు రావడం కొత్త కావడంతో స్మార్ట్ ఫోన్ మొబైల్ వినియోగదారులు బెంబేలెత్తి పోతున్నారు.

Google Map : గూగుల్ మ్యాప్ అనుసరిస్తూ కూలిన వంతెనపై కారు నడుపుతూ మరణించిన వ్యక్తి.. గూగుల్ నిర్లక్ష్యంపై దావా వేసిన అతని కుటుంబం

కొందరు మొబైల్ యూజర్లు ఒకే అని కొడుతుండగా.. మరికొందరు ఒకేపై క్లిక్‌చేస్తే ఏమవుతుందోనన్న భయంతో ఫోన్‌ను దూరంగా పెడుతున్నారు. ఇలా సమయం అనేది లేకుండా మూడు భాషల్లో (ఇంగ్లీష్, హిందీ, తెలుగు) ఈ మెస్సేజ్ అలర్ట్ వస్తుంది. కొందరు మొబైల్ యూజర్లు భయంతో మొబైల్ షాపు వద్దకు పరుగులు పెడుతున్న పరిస్థితి. అయితే, ఈ మెస్సేజ్ లపై కేంద్రం స్పందించింది.. టెస్టింగ్‌లో భాగంగానే వినియోగదారులకు అలా అలర్ట్ మెసేజ్ పంపినట్లు కేంద్రం వివరణ ఇచ్చింది. దీనిపై భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేసింది.

Mobile Alert

దేశ వ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌ల యూజర్లకు ఈ అలర్ట్ మెస్సేజ్‌లు వస్తున్నాయి. ఈ అలర్ట్ పై కేంద్రం వివరణ ఇస్తూ.. ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ ప్రసార సిస్టమ్ ద్వారా పంపబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి ఈ మెస్సేజ్‌ను విస్మరించండి అని పేర్కొంది. ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్‌లో భాగంగా ఈ మెస్సేసజ్ అని, అత్యవసర ప్రసార సామర్థ్యాలను అంచనా వేసేందుకు టెస్టింగ్ అని తెలిపింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దశల వారీగా ఈ పరీక్షలను నిర్వహిస్తుంది.