Viral Video: నిజమైన వారియర్ అంటే ఈమెనే.. బిడ్డను ఎత్తుకుని ఈ తల్లి చేసిన పనికి..

అలాగే, చేతిలో కర్ర పట్టుకుని ప్లాట్‌ఫాంపై నిలుచున్నారు.

ఓ ఆర్‌పీఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ తన బిడ్డను ఎత్తుకుని ఢిల్లీలోని రైల్వే స్టేషన్‌లో డ్యూటీ చేశారు. విధి నిర్వహణలో ఆమె చూపిన నిబద్ధతకు జనాలు సెల్యూట్ కొడుతున్నారు. ఆ ఆర్‌పీఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌కు సంబంధించిన వీడియోను ఆర్‌పీఎఫ్‌ ఇండియా ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఆ కానిస్టేబుల్‌ పేరు రీనా. ఆమె స్టేషన్‌లో తన బిడ్డను ఎత్తుకునే, అలాగే, చేతిలో కర్ర పట్టుకుని ప్లాట్‌ఫాంపై నిలుచున్నారు. రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులను కంట్రోల్ చేశారు. ప్రతి ఒక్కరు తమ జీవితంలో విధుల్ని నిర్వహించాల్సి ఉంటుంది.

ఉద్యోగంలో ఎంతో బాధ్యతతో, నిజాయితీతో పని చేయాలి. మన వ్యక్తిత్వాన్ని అమ్ముకోకుండా ఆ పనులు చేస్తుండాలి. ఈ ఆర్‌పీఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ వాటన్నింటినీ సమన్వయంతో తన విధిని నిర్వర్తించారని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఈమెలా మనం చేసేపనిని అంకితభావంతో చేస్తే, మనకు పేరు, గుర్తింపు, సంతృప్తి లభిస్తాయని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు ఇలా తమ విధులను న్యాయంగా నిర్వహిస్తే దేశం అభివృద్ధి చెందుతనంది మరో నెటిజన్ పేర్కొన్నాడు. రీనా అంకితభావంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఇటీవల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. ఇందులో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో స్టేషన్‌లో రీనా విధులు నిర్వర్తించారు. వృత్తి పట్ల అంకిత భావం ఉండడం సరైందే కానీ ఇలా బిడ్డను ఎత్తుకువచ్చి విధులు నిర్వర్తించే అవసరం లేదని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు.