TN’s Karur : వ్యాక్సిన్ వేయించుకుంటే..వాషింగ్ మెషిన్, గ్రైండర్, వెట్ గ్రైండర్ గిఫ్ట్స్

తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లా యంత్రాంగం కానుకల జల్లు కురిపించనుంది. 2021, అక్టోబర్ 10వ తేదీ ఆదివారం మెగా డ్రైవ్ కార్యక్రమం నిర్వహించనుంది.

TN’s Karur : వ్యాక్సిన్ వేయించుకుంటే..వాషింగ్ మెషిన్, గ్రైండర్, వెట్ గ్రైండర్ గిఫ్ట్స్

Tamilnadu Vaccine

Updated On : October 9, 2021 / 10:13 AM IST

Covid-19 Vaccine : ప్రతొక్కరికీ కరోనా వ్యాక్సిన్ ఇప్పించాలనే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ప్రతొక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, రెండు డోసులు తప్పకుండా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయినా..కొంతమంది వ్యాక్సిన్ వేసుకోవడానికి ఇంకా వెనుకంజ వేస్తున్నారు. దీంతో వారిలో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇతర సంస్థలు బహుమతులను కూడా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

Read More : Aryan Khan : 15 ఏళ్లకే డ్రగ్స్ తీసుకున్నా..ఆర్యన్ ఖాన్ పిల్లోడు – సోమీ ఆలీ

తాజాగా…తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లా యంత్రాంగం కానుకల జల్లు కురిపించనుంది. 2021, అక్టోబర్ 10వ తేదీ ఆదివారం మెగా డ్రైవ్ కార్యక్రమం నిర్వహించనుంది. తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని..ఇలా వేయించుకున్న వారికి బహుమతులు అందచేస్తామని కరూర్ జిల్లా కలెక్టర్ టి.ప్రభు శంకర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా…టీకా వేయించుకున్న వారికి బహుమతులు అందచేస్తుందని, ఇందుకు లక్కీ డ్రా నిర్వహించనుందని తెలిపారు. లక్కీ డ్రా విజేతలకు వాషింగ్ మెషిన్, వెట్ గ్రైండర్, మిక్సర్ గ్రైండర్ లతో సహా…పలు బహుమతులను అందచేయడం జరుగుతుందన్నారు.

Read More : SC Railway : పండగ బాదుడు.. పెరిగిన రైలు చార్జీలు

మొదటి మూడు స్థానాల విజేతలకు వాషింగ్ మెషిన్, వెట్ గ్రైండర్, మిక్సర్ గ్రైండర్ అందచేయనున్నామని, 24 ప్రెజర్ కుక్కర్లు, 100 ప్రోత్సాహక బహుతులు కూడా ఇవ్వనున్నామన్నారు. టీకా కేంద్రాలకు లబ్దిదారులని తీసుకరావడంలో…స్వచ్చందంగా పనిచేసేవారికి రూ. 5 ప్రోత్సాహకంగా ఇవ్వనున్నామని, 25 మంది కంటే…ఎక్కువమందిని తీసుకొచ్చే వాలంటీర్ పేరు లక్కీ డ్రాలో చేర్చుతామన్నారు. మరోవైపు…ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలకు పూనుకుంది. కరోనా టీకా తీసుకోని ఉద్యోగులు అక్టోబర్ 16 నుంచి కార్యాలయాలకు వచ్చేందుకు అనుమతి నిరాకరించింది. ఒక్క డోసు అయినా తీసుకున్న తర్వాతే..వారికి అనుమతినిస్తామని వెల్లడించింది.