కత్తులతో డాన్స్ చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. వీడియో వైరల్

  • Publish Date - November 16, 2019 / 05:06 AM IST

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కత్తి పట్టింది. శుక్రవారం (నవంబర్ 15, 2019)న గుజరాత్ లోని భావ్ నగర్ లో జరిగిన ఓ కల్చరల్ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి స్టేజ్ మీద కత్తులు పట్టుకుని డాన్స్ చేశారు.

ఈ డాన్స్ పేరు తల్వార్ రాస్. ఇది సాంప్రదాయ జానపద నృత్యం, గుజరాత్, రాజస్థాన్లలో ఈ డాన్స్ ప్రసిద్ది చెందింది. ఇందులోని స్పెషల్ ఏమిటంటే.. రెండు చేతుల్లో కత్తులు పట్టుకుని డాన్స్ చేయడం. ఇక స్మృతి ఇరానీ విద్యార్థులతో సమానంగా స్టెప్పులు వేశారు. ఆమె డాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.