Python Video: వామ్మో చూస్తేనే భయం వేస్తోంది.. భారీ కొండ చిలువను చివరకు..

కొండ చిలువ కనపడడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దాన్ని చాకచక్యంగా..

Python

Python Video: ఓ ట్రక్కులో ఎనిమిది అడుగుల కొండచిలువ కనపడింది. దాన్ని పట్టుకుని తీసుకెళ్లిన వీడియోను ఉత్తరప్రదేశ్ పోలీసులు తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నోయిడాలోని ఓ ప్రాంతంలో ట్రక్కులో కదులుతున్న కొండ చిలువను గుర్తించిన ఓ వ్యక్తి దీనిపై పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో అక్కడి చేరుకున్న ఎస్సై దేవేందర్ రాఠి, అతని టీమ్ రోప్-సాక్ టెక్నిక్ ఉపయోగించి ఆ కొండ చిలువను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ కొండ చిలువ ట్రక్కు నుంచి బయటకు వచ్చి బైకుపైకి ఎక్కే ప్రయత్నం చేసింది. పోలీసులు దాన్ని సురక్షితంగా పట్టుకుని తీసుకెళ్లారు.

ట్రక్కులో కొండ చిలువ కనపడడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దాన్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులపై అధికారులు ప్రశంసలు కురిపించారు. ట్రక్కుని డ్రైవర్ ఓ ప్రాంతంలో ఆపిన సమయంలో ఆ కొండ చిలువ దానిలోకి ఎక్కినట్లు తెలుస్తోంది.

Israel : ఇజ్రాయెల్ నుంచి షాకింగ్ వీడియో.. బందీగా కుటుంబం.. కళ్లముందే కూతురికి ఉరి..