రాహుల్ పౌరసత్వంపై పిటిషన్..కొట్టేసిన సుప్రీం

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్ ను గురువారం(మే-9,2019)సుప్రీంకోర్టు కొట్టేసింది.రాహుల్ గాంధీ స్వచ్చందంగా బ్రిటన్ పౌరసత్వం పొందాడని,లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలంటూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఆదేశించాలని కోరుతూ హిందూమహాసభ కార్యకర్త వేసిన పిటిషన్ ను సుప్రీం కొట్టేసింది.పిటిషన్ లో ఎటువంటి మెరిట్ లేదని సీజేఐ రంజన్ గొగొయ్ తెలిపారు.