అజిత్ పవర్ నిర్ణయాన్ని సమర్థించం…ఆమోదించం – శరద్ పవార్

  • Publish Date - November 23, 2019 / 04:27 AM IST

మహారాష్ట్రలో ఎన్సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం పట్ల శరద్ పవార్ స్పందించారు. బీజేపీకి మద్దతు ఇవ్వడం అజిత్ పవర్ వ్యక్తిగతమని చెప్పుకొచ్చారు. ఇది ఎన్సీపీ పార్టీ తీసుకున్న నిర్ణయం కాదని చెప్పారు. 2019, నవంబర్ 23వ తేదీ శనివారం ఉదయం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. అజిత్ పవర్ నిర్ణయాన్ని సమర్థించం…ఆమోదించమని చెప్పడంతో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. 

Read More : మహా ట్విస్ట్ : రాష్ట్రపతి పాలన ఎత్తివేత
కొన్ని రోజులుగా మహారాష్ట్రలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాయి. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీలు కలిసి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఊహించారు. ఇందుకు ఇరు పార్టీల నేతలు చర్చలు జరిపారు కూడా. కానీ ఈ చర్చలు సాగుతూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రపతి పాలన విధించింది. కానీ 2019, నవంబర్ 23వ తేదీ శనివారం ఉదయం సీఎంగా ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్‌లు ప్రమాణం చేయడం సంచలనం సృష్టించింది. ఎన్సీపీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో శివసేన ఖంగుతింది. దీనిపై అజిత్ పవర్ చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 
Ajit Pawar’s decision to support the BJP to form the Maharashtra Government is his personal decision and not that of the Nationalist Congress Party (NCP).
We place on record that we do not support or endorse this decision of his.