Weather Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..తమిళనాడుపై విరుచుకుపడనుందా?

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం రూపుదిద్దుకుంటోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం తమిళనాడుపై పడుతుందని అంచనా వేస్తున్నారు.

weather update today.. బంగాళాఖాతంలో వరుస అల్పపీడలనాలు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. వరుస తుఫాన్లతో జనాలు ఇప్పటికే అల్లాడిపోతున్నారు. వర్షాలతో ఇండ్లు కూడా కూలిపోయి, కొట్టుకుపోతున్న పరిస్థితి. వరద ప్రభావిత ప్రాంతాల్లో.. జనాలు జలసమాధి అవుతున్నారు. వరద నీటిలో గల్లంతు అయినవారు జీవించి ఉన్నారో లేదో కూడా తెలియని దుస్థితి నెలకొంది. ఈక్రమంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతోంది. ఇది..తమిళనాడుపై పెను ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా రాయసీమ జిల్లాలు అతలాకుతలం అయిపోతున్నాయి.కరువు కాటకాలతో ఆవాలమైన నేల.. తాగు నీటి కోసమే యుద్ధం చేయాల్సిన పల్లెలు.. నేడు వరదల సడిగుండంలో చిక్కుకుని రాయలసీమ అల్లాడిపోయింది. వారం రోజులు.. క్షణమొక యుగంలా గడిపింది. వరణుడికి బీపీ వచ్చిందా అన్నట్లుగా ఏపీని వణికించినట్టు.. గడగడలాడిస్తున్నాడు. ఎన్నో ప్రాణాలు పోయాయి. అయినా వరుణుడు కాస్త శాంతించాడు అనుకుంటే మరో అల్పపీడతనం రూపుదిద్దుకుంటోంది.

Trains Canceled : ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా పలు రైళ్లు రద్దు

వర్షాలు కురవటం కాస్త ఆగినా వరద మిగిల్చిన బురద అలాగే ఉంది. ఆ బురదలోనే జనం నానిపోతున్నారు.. కన్నీరుమున్నీరవుతున్నారు. రికార్డ్‌ స్థాయిలో కురిసిన వర్షాలు, వరదల నుంచి ఇంకా తేరుకోకముందే మరో ముప్పు ముంచుకొస్తోంది.రానున్న 24 గంటల్లో దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని ప్రకటించింది వాతావరణ శాఖ. దీని ప్రభావం శ్రీలంక-దక్షిణ తమిళనాడుపై తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తోంది.

బుధవారం నుంచి మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ తమిళనాడు తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే తమిళనాడుపై ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అయితే చిత్తూరు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచావేస్తున్నారు.

AP Floods : కడప జిల్లాలో 40కి చేరిన మృతుల సంఖ్య

ట్రెండింగ్ వార్తలు